Chiranjeevi,Balakrishna: చిరంజీవి, బాలకృష్ణల రీసెంట్ రికార్డ్స్ ఏ సినిమాలవో తెలుసా?..

మెగాస్టార్ చిరంజీవి, నటసింహ నందమూరి బాలకృష్ణ సినిమాల మధ్య ఉండే పోటీ వాతావరణం గురించి.. ఇరు హీరోల అభిమానుల మధ్య నెలకొనే విబేధాల గురించి కొత్తగా, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ‘‘మేమిద్దరం మంచి స్నేహితులం.. ఇండస్ట్రీలో నేను ఒక్క చిరంజీవితోనే స్నేహం చేస్తాను.. ఏ రంగంలోనైనా పోటీ లేకపోతే రంజుగా ఉండదు.. అలానే మా సినిమాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ మాత్రమే ఉంటుంది’’ అని ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ప్రమోషన్ అప్పుడు స్వయంగా బాలయ్య బాబే చెప్పాడు..

ఇప్పుడు 2023 సంక్రాంతికి ‘వీరసింహా రెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలతో ఈ అగ్ర హీరోలిద్దరూ బాక్సాఫీస్ బరిలోకి దిగబోతున్న నేపథ్యంలో మరోసారి అభిమానుల మధ్య హంగామా, ఆధిపత్య పోరు మొదలైంది.. పైగా రెండు సినిమాలూ ఒక్కరోజు గ్యాప్‌లోనే వస్తున్నాయి.. ఇప్పటికే ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో చిరు కంటే బాలయ్యదే పై చేయి అయింది.. అలానే బాలయ్య సినిమాకి భారీ హైప్ వచ్చింది.. రెండిట్లోనూ శృతి హాసనే హీరోయిన్.. ఒకటే నిర్మాణ సంస్థ..

రెండు సినిమాల పాటలు, ట్రైలర్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా వెంట వెంటనే ప్లాన్ చేసేశారు.. జనవరి 12న బాలయ్య, 13న మెగాస్టార్ తలపడబోతున్నారు.. ఇప్పటికే ఈ బిగ్ స్టార్స్ పలుసార్లు సంక్రాంతి సీజన్‌లో పోటీ పడగా ఒక్కోసారి ఒక్కరిది పై చేయి అయింది.. ఈ నేపథ్యంలో ఇంతకుముందు కంటే కూడా ఈసారి పోటీ మాంచి రసవత్తరంగా మారింది..

ఇక వీళ్ల సినిమాల మధ్య హిందీ టీజర్, ట్రైలర్ విషయంలో బాలయ్య సెట్ చేసిన ఓ రేర్ రికార్డ్ గురించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే.. జనవరి 5న ‘అఖండ’ హిందీ వెర్షన్ ట్రైలర్ వదిలారు.. కేవలం 9 గంటల్లోనే 2 మిలియన్ వ్యూస్ సాధించింది.. ఇక ‘వాల్తేరు వీరయ్య’ 8 రోజుల్లో 1.9 మిలియన్ వ్యూస్ రాబట్టింది.. అంటే చిరు సినిమాకి 8 రోజులు పడితే బాలయ్య కేవలం 9 గంటల్లోనే ఆ మార్క్ క్రాస్ చేసేశాడు..

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus