Prabhas: డబుల్ బొనాంజా గ్యారంటీ అంటున్న ప్రభాస్.. కానీ?

స్టార్ హీరో ప్రభాస్ ఈ ఏడాది మూడు సినిమాలను విడుదల చేస్తారని ప్రభాస్ అభిమానులు భావించారు. అయితే వేర్వేరు కారణాల వల్ల ఈ ఏడాది ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ మినహా మరే సినిమా విడుదల కావడం లేదు. అయితే వచ్చే ఏడాది మాత్రం ప్రభాస్ హీరోగా నటించిన రెండు సినిమాలు విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాల రిలీజ్ విషయంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపించాయి.

ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా 2023 సంవత్సరం జనవరిలో థియేటర్లలో విడుదల కానుండగా సలార్ మూవీ కూడా 2023 ఫస్ట్ హాఫ్ లో విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఈ ఏడాదే సలార్ మూవీ షూటింగ్ పూర్తి కానుందని సమాచారం అందుతోంది. అయితే ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు కూడా మాస్ సినిమాలుగా పాన్ ఇండియా ప్రేక్షకులను మెప్పించే కథాంశంతో తెరకెక్కాలని ప్రేక్షకులు భావిస్తున్నారు. మరి ఫ్యాన్స్ కామెంట్లను ప్రభాస్ పట్టించుకుంటారో లేదో చూడాల్సి ఉంది.

మరోవైపు ప్రభాస్ మారుతి కాంబో మూవీ మరింత ఆలస్యం కానుందని సమాచారం అందుతోంది. ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కె సినిమాలకు ప్రభాస్ ప్రాధాన్యత ఇస్తున్నారని బోగట్టా. పక్కా కమర్షియల్ సినిమా రిజల్ట్ కోసం ప్రభాస్ వేచి చూస్తున్నారని సమాచారం అందుతోంది. గోపీచంద్ హీరోగా నటించిన పక్కా కమర్షియల్ సినిమా జులై 1వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా విజయాన్ని అందుకుంటే 2023 సంవత్సరంలో ప్రభాస్ మారుతి మూవీ పట్టాలెక్కనుంది.

మరోవైపు ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబో మూవీ నిదానంగా తెరకెక్కుతోందని 550 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ఈ సినిమాలతో పాటు ప్రభాస్ స్పిరిట్ అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. వరుస సినిమాలతో ప్రభాస్ కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus