పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) ,రామ్ (Ram) కాంబినేషన్లో ‘ఇస్మార్ట్ శంకర్’ (iSmart Shankar) అనే మూవీ వచ్చి బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్ గా ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) రూపొందింది. కావ్య థాపర్ (Kavya Thapar) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సంజయ్ దత్ (Sanjay Dutt) విలన్ గా నటించాడు. టీజర్, ట్రైలర్ వంటివి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మణిశర్మ (Mani Sharma) సంగీతంలో రూపొందిన పాటలు కూడా సినిమా హైప్ కి పనికొచ్చాయి. అందుకే ఆగస్టు 15న రిలీజ్ కాబోతున్న ‘డబుల్ ఇస్మార్ట్’ కి మంచి థియేట్రికల్ బిజినెస్ జరిగింది అని చెప్పాలి.
ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :
నైజాం | 15.00 cr |
సీడెడ్ | 6.00 cr |
ఆంధ్ర | 18.00 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 39.00 cr |
హిందీ | 3.00 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 4.00 cr |
ఓవర్సీస్ | 3.00 cr |
వరల్డ్ వైడ్ (టోటల్ ) | 49.00 cr |
‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.49 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.50 కోట్ల షేర్ ను రాబట్టాలి. పాజిటివ్ టాక్ కనుక వస్తే మాస్ సెంటర్లోని ఆడియన్స్ ఎగబడి సినిమాని చూసే అవకాశం ఉంది. పైగా 4 రోజులు హాలిడేస్ కూడా వచ్చాయి. సో ‘డబుల్ ఇస్మార్ట్’ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు.