మోడల్, అసిస్టెంట్ డైరెక్టర్ కమ్ యాక్ట్రెస్ అయిన శివలీక ఒబెరాయ్, డైరెక్టర్ అభిషేక్ పాఠక్ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. శివలీక.. హిందీలో సల్మాన్ ఖాన్ ‘కిక్’, ‘హౌస్ ఫుల్ 3’ సినిమాలకు దర్శకత్వ శాఖలో పని చేసింది. అమ్రిష్ పురి మనవడు వర్థన్ పురి ఇంట్రడ్యూస్ అయిన ‘ఏ సాలీ ఆషికి’ తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత అభిషేక్ పాఠక్, తన తండ్రి కుమార్ మంగత్ పాఠక్ కలిసి నిర్మించి ‘ఖుదా హఫీజ్’ లో విద్యుత్ జమ్వాల్‌తో కలిసి నటించింది శివలీక..
ఆ సమయంలోనే అభిషేక్‌తో ప్రేమలో పడిందట.. తర్వాత ఇదే బ్యానర్ తీసిన సీక్వెల్ ‘ఖుదా హఫీజ్ చాప్టర్ 2 – అగ్నిపరీక్ష’ లోనూ కథానాయికగా చేసింది. అభిషేక్.. తమ పనోరమా స్టూడియోస్ సంస్థలో రూపొందిన ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ వంటి రీమేక్ చిత్రాలతో దర్శకుడిగా ఆకట్టుకున్నాడు..టర్కీలో గతేడాది జూలై 24న నిశ్చితార్థం అయింది.
ఫిబ్రవరి 9న గోవాలో ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ సమక్షంలో ఒక్కటయ్యారు శివలీక – అభిషేక్.. శివలీక షేర్ చేసిన పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్, నెటిజన్లు, ఇండస్ట్రీ వర్గాల వారు కొత్తజంటకు విషెస్ తెలియజేస్తున్నారు.
రైటర్ పద్మభూషణ్ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!
మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!