‘ఆ నలుగురు’, ‘మధుమాసం’, ‘అందరి బంధువయా’, ‘ఇదీ సంగతి’, ‘ఆటగదరా శివా’ తదితర సినిమాలతో ప్రామిసింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు చంద్ర సిద్ధార్థ్. కొంత గ్యాప్ తర్వాత ఆయన తెరకెక్కించిన చిత్రం ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’. ఎ ఫర్‌బిడెన్ రాగ ఫ్రమ్ ఎ ఫర్‌బిడెన్ సాగా… అనేది క్యాప్షన్. ఈ మధ్య కాలంలో ఏ సినిమాకీ సాధ్యంకాని విధంగా టైటిల్ తోనే హాట్ టాపిక్ అయ్యింది ‘ఈ పాట కోరినవారు…'(Ee Paata Korinavaaru)!
సీనియర్ దర్శక రచయిత మదన్ ఈ చిత్రానికి కథ అందించారు. వై.వి.సత్యనారాయణ రాజు సమర్పణలో ఫిల్మోత్సవ్ పతాకంపై చంద్ర సిద్ధార్థ్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 18న విడుదలయ్యింది. మొదటి షోతోనే పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. దీంతో చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తుంది. సంగీతం, ధ్వని, మానవ మెదడు మధ్య ఉన్న సంబంధాన్ని కథలో కీలకంగా చూపించారు. సౌండ్ థెరపీ, బ్రెయిన్ మ్యాపింగ్, మెమరీస్, గిల్ట్ వంటి అంశాలను కూడా ప్రస్తావించారు.
ఇక ‘ఫస్ట్ హాఫ్ అంతా హర్రర్ అండ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ తో సాగిందని, సెకండాఫ్ మంచి మ్యూజికల్ ఫీల్ ఇచ్చిందని, క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టులు, ఎమోషన్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయని’ చిత్ర బృందం తెలిపింది. హర్ష హీరోగా, అమైరా గోస్వామి, సుజనా రెడ్డి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో ఇనాయా సుల్తానా, రవివర్మ, అశోక్ వర్ధన్, రేఖా నిరోషా కీలక పాత్రలు పోషించారు.