ఈ వారం థియేటర్లలో 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో క్రేజ్ ఉన్న సినిమా అంటే… ఒక్క ‘ది పారడైజ్’ సినిమా అనే చెప్పాలి. నాని నటించిన సినిమా ఇది. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది. సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దీని పక్కన పెద్దగా క్రేజ్ ఉన్న సినిమాలు ఏవీ రిలీజ్ కావడం లేదు. ఓటీటీల్లో కూడా చెప్పుకోదగ్గ సినిమాలు ఏవీ అనౌన్స్ చేసింది లేదు. కొద్దో గొప్పో ‘అగధ’ అనే హర్రర్ అండ్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
ఇంకెందుకు ఆలస్యం.. ఈ వారం (This Week Releases) థియేటర్లలో రిలీజ్ అవుతున్న అలాగే ఓటీటీల్లో స్ట్రీమింగ్ కి రెడీగా ఉన్న సినిమాల లిస్టుని ఓ లుక్కేద్దాం రండి :
ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు
1) ది పారడైజ్ : సెప్టెంబర్ 24న విడుదల
2) అనుమానపక్షి : సెప్టెంబర్ 25న విడుదల
3) ప్రేమనే ఊరిలో : సెప్టెంబర్ 25న విడుదల
4) కళ్యాణం కమనీయం జీవితం : సెప్టెంబర్ 25న విడుదల
ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్
జీ5
5) అగధ : సెప్టెంబర్ 25 నుండీ స్ట్రీమింగ్ కానుంది
నెట్ ఫ్లిక్స్
6) షేక్ – ట్రస్ట్ నో వన్ : సెప్టెంబర్ 24 నుండీ స్ట్రీమింగ్ కానుంది
7) ఉనబాంబర్ : సెప్టెంబర్ 25 నుండీ స్ట్రీమింగ్ కానుంది
జియో హాట్ స్టార్
8) హుంకార్ – ది రోర్ : సెప్టెంబర్ 25 నుండీ స్ట్రీమింగ్ కానుంది
అమెజాన్ ప్రైమ్ వీడియో
9) డోంట్ బి షై : సెప్టెంబర్ 25 నుండీ స్ట్రీమింగ్ కానుంది
10) రైజ్ అండ్ ఫాల్(సీజన్ 2) : సెప్టెంబర్ 26 నుండీ స్ట్రీమింగ్ కానుంది