Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Advertisement

ఈషా రెబ్బా(Eesha Rebba) పరిచయం అవసరం లేని పేరు. తెలుగమ్మాయి, చాలా చక్కగా ఉంటుంది, అంతే చక్కగా నటిస్తుంది అనే మంచి పేరు ఈమెకు ఉంది. చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్ సినిమా ఆమె ఖాతాలో లేకపోయినా.. ఆమెకు ఇప్పటికీ అవకాశాలు వస్తున్నాయి అంటే అవే కారణాలు అని చెప్పాలి. సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడికి బాగా క్రేజ్ ఎక్కువ. ఫేస్బుక్ తీసుకున్నా, ఇన్స్టా గ్రామ్ తీసుకున్నా, ట్విట్టర్ తీసుకున్నా  ఈమెకు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. ఒక్కోసారి అదే ఈమెను ఇబ్బందులకు గురిచేస్తుంది. తాజాగా అంతకు మించిన చేదు అనుభవం ఈమెకు ఎదురైనట్టు తెలుస్తుంది.

Eesha Rebba

హీరోయిన్ ఈషా రెబ్బా బంజారా హిల్స్ పోలీసులను ఆశ్రయించడం చర్చనీయాంశం అయ్యింది. విషయంలోకి వెళితే.. ఇన్స్టాగ్రామ్లో ఆమె తన కొత్త ఫోటోని షేర్ చేసింది. దీంతో కొంతమంది నెటిజెన్లు హద్దులు మీరీ అసభ్యకరమైన కొమెంట్లు చేశారు. అవి ఈషాని మానసికంగా ఇబ్బంది పెట్టాయి. దీంతో ఆమె వెంటనే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. ఆ నెటిజెన్ల ఐడీలు కూడా ఆమె పోలీసులకు షేర్ చేసినట్టు తెలుస్తుంది.

అయితే ఆమె పోస్ట్ చేసిన ఫోటో కానీ దానికి సంబంధించిన కామెంట్లు కానీ ప్రస్తుతం అందుబాటులో లేకుండా ఆమె డిజేబుల్ చేసినట్టు స్పష్టమవుతుంది.   ఈ క్రమంలో నెటిజెన్లు రకరకలుగా స్పందిస్తున్నారు. కొంతమంది ‘ఈ మాత్రం దానికి పోలీసులు ఎందుకు? బ్లాక్ అనే ఆప్షన్ ఉంది కదా’ అంటున్నారు. ఇంకొంతమంది అయితే ‘మహిళలందరూ ఇలాగే ధైర్యంగా తప్పునీ ఎదురించాలి’ అంటూ ప్రశంసిస్తున్నారు.

ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus