ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబినేషన్లో ‘బేబీ’ సినిమా వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. దీంతో వీరి కాంబినేషన్లో రూపొందిన రెండో సినిమా ‘ఎపిక్'(Epic) పై కూడా మొదటి నుండీ మంచి అంచనాలే ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్, సంచారమే సాంగ్ ఇలా ప్రమోషనల్ కంటెంట్ అంతా ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అలాగే యూత్ ను టార్గెట్ చేసింది.
కొన్ని అంశాల పై సోషల్ మీడియాలో గట్టి చర్చ కూడా జరిగింది.మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. కొంతమంది బాగుంది అన్నారు. ఇంకొంతమంది బాలేదు అన్నారు. ఓపెనింగ్స్ కూడా మిక్స్డ్ గానే నమోదయ్యాయి. 2వ రోజు కూడా ఆల్మోస్ట్ అలానే ఉన్నాయి. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
| నైజాం | 0.90 cr |
| సీడెడ్ | 0.16 cr |
| ఆంధ్ర(టోటల్) | 0.71 cr |
| ఏపీ +తెలంగాణ(టోటల్) | 1.77 cr (షేర్) |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.20 cr |
| ఓవర్సీస్ | 0.70 cr |
| వరల్డ్ వైడ్ (టోటల్) | 2.67 (షేర్) |
‘ఎపిక్’ చిత్రానికి రూ.9 కోట్ల వరకు ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కొరకు రూ.10 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మిక్స్డ్ టాక్ ఎఫెక్ట్ కారణంగా 2 రోజుల్లో ఈ సినిమా కేవలం రూ.2.67 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.7.33 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.