యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. కాబట్టి అతనికి సంబంధించిన ఏ చిన్న వార్త అయినా ఇండియన్ లెవెల్లో వైరల్ అయిపోతుంటుంది. ఇప్పటి వరకూ ఎక్కువగా ఆయన సినిమా వార్తలు, పెళ్ళి వార్తలు మాత్రమే వైరల్ అవుతూ వచ్చేవి. ఇప్పుడు ప్రభాస్ క్వారంటైన్ లుక్ కూడా వైరల్ అయిపోతుండడం విశేషం.ఇటీవల గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభాస్.. మంత్రి సంతోష్ కుమార్ తో కలిసి మొక్కలు నాటుతూ మీడియా కంట పడ్డాడు.
అయితే ఈ వీడియోలో ప్రభాస్ లుక్ చూసి ఫ్యాన్స్ అంతా షాక్ కు గురవ్వుతున్నారు. మొన్నటి వరకూ ఎంతో స్లిమ్ గా కనిపించిన ప్రభాస్.. సడన్ గా ఒళ్ళు పెంచేసాడు. ఓ లూజ్ షర్ట్ వేసి కవర్ చెయ్యాలని ప్రయత్నించాడు కానీ అది వర్కౌట్ కాలేదు. ‘బిల్లా’ సినిమా వరకూ ఎంతో ఫిట్ గా ఉంటూ వచ్చిన ప్రభాస్.. తరువాతి సినిమాల నుండీ షూటింగ్ కు కాస్త గ్యాప్ వస్తే మాత్రం లావైపోతున్నాడు. ‘బాహుబలి’ షూటింగ్ టైం లో ప్రభాస్ కు రెండు మూడు సార్లు సర్జరీ అయ్యింది.
సరిగ్గా అప్పటి నుండే ఇలా లావైపోతున్నట్టు తెలుస్తుంది. గత లాక్ డౌన్ కారణంగా గత రెండు నెలలు పై నుండీ ఎటువంటి షూటింగ్ లేదు.. కాబట్టి వర్కౌట్లు పక్కన పెట్టేసి.. ఇష్టమొచ్చిన ఫుడ్ తింటూ .. ఫిట్ నెస్ ను పూర్తిగా గాలికి వదిలేసినట్టు ఉన్నాడు ప్రభాస్. షూటింగ్ సమయంలో మాత్రం ఎంతో కేరింగ్ గా ఉండే ప్రభాస్.. ఒక్కసారి షూటింగ్ లేదు అంటే మాత్రం.. షేపవుట్ అయిపోతున్నాడు. అసలే పాన్ ఇండియా స్టార్.. ఆ మాత్రం ఫిజిక్ మెయింటైన్ చెయ్యకపోతే మాత్రం చాలా కష్టమని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అది కూడా నిజమే మరి..!
1
2
3
4
5
6
Most Recommended Video
కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!