కవల పిల్లలకు జన్మనిచ్చిన 10 సెలెబ్రిటీలు వీరే..!

మనిషి జీవితంలో సంతానం అనేది చాలా ముఖ్య ఘట్టం. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు కావాలని కోరుకుంటారు. తమ పిల్లల ద్వారా వారసత్వాని ముందుకు తీసుకెళ్లాలి అనుకుంటారు. మన చుట్టూ ఉండే మిత్రులకో, బంధువులకో పిల్లలు పుట్టారని తెలిస్తే మనకు ఎక్కడలేని ఆసక్తి పుట్టుకొస్తుంది. అబ్బాయా, అమ్మాయా, నలుపా, తెలుపా అని అనేక విషయాలు అడిగి తెలుసుకుంటూ ఉంటాం. ఇక సెలెబ్రిటీల విషయంలో వారి అభిమానులకు ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు. మరి వారికి కవలలు పుడితే, మరింత ఉత్సుకత కనబరుస్తాము. మరి వెండితెర తారలతో కొందరికి ట్విన్స్ పుట్టినవారు ఉన్నారు. వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం రండి :

మంచు విష్ణు

2009లో హీరో మంచు విష్ణు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బంధువు అయిన విరానికా రెడ్డిని వివాహం చేసుకున్నారు. వీరికి మొదటి సంతానంగా ఇద్దరు కవులు పిల్లలు పుట్టారు. ఆడ పిల్లలు అయిన వీరికి ఆరియానా, వీవియానా అనే పేర్లు పెట్టారు. ఆ తరువాత విష్ణు ఓ అబ్బాయి మరియు అమ్మాయికి జన్మనిచ్చారు.

సంజయ్ దత్

బాలీవుడ్ హీరో సంజయ్ దత్ హీరోయిన్ మాన్యతా దత్ ని 2008లో మూడో వివాహం చేసుకున్నారు. వీరికి 2010లో ఇద్దరు కవలలు పుట్టారు. వారిలో ఒకరు అబ్బాయి మరొకరు అమ్మాయి. అబ్బాయికి షాహరాన్ అని అమ్మాయికి ఇక్రాన్ అని పేర్లు పెట్టారు.

ఉదయ భాను

ఒకప్పుడు స్టార్ యాంకర్ గా ఓ వెలుగు వెలిగిన ఉదయభాను మొదట ఒకరిని ప్రేమ వివాహం చేసుకుంది. కొన్నాళ్ళకు అతనితో విడిపోయి విజయ్ కుమార్ అనే ఓ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం జరిగింది. వీరికి కవల ఆడ పిల్లలు పుట్టారు. వీరికి యువి నక్షత్ర, భూమి ఆరాధ్య అనే పేర్లు ఆమె పెట్టారు.

భరత్

బాయ్స్ సినిమాతో వెండితెరకు పరిచయమైన హీరో భరత్ ప్రేమిస్తే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయమయ్యాడు. ఇక 2013లో భరత్ తన చిన్నప్పటి ఫ్రెండ్ జెస్లీ ని పెళ్లి చేసుకున్నారు. 2018లో వీరికి ఇద్దరు మగ కవల పిల్లలు పుట్టారు. వీరికి ఆద్యన్, జేన్ అనే పేర్లు పెట్టారు. వీరు ఐడెంటికల్ ట్విన్స్ అని తెలుస్తుంది.

సన్నీ లియోన్

బాలీవుడ్ శృంగార తార సన్నీ లియోన్ డానియల్ వెబర్ ని 2011లో వివాహం చేసుకుంది. వీరు నిషా అనే ఓ ఆడపిల్లను 2017లో దత్తత తీసుకున్నారు. అదే ఏడాది సన్నీ లియోన్ ఇద్దరు కవల మగపిల్లలకు జన్మనిచ్చింది. వీరికి అషర్ అండ్ నోహా అనే పేర్లు పెట్టారు.

కరణ్ జోహార్

బాలీవుడ్ దర్శక నిర్మాత మరియు హోస్ట్ కరణ్ జోహార్ కి 2017లో ఇద్దరు కవలలు పుట్టారు. వీరిలో ఒకరు అమ్మాయి, మరొకరు అబ్బాయి. వీరి పేర్లు రూహి మరియు యష్. ఐతే కరణ్ జోహార్ వైఫ్ ఎవరు అనేది సస్పెన్సు.

ఫరా ఖాన్

బాలీవుడ్ లేడీ డైరెక్టర్ మరియు నటి ఫరా ఖాన్ 2004లో కొరియాగ్రాఫర్ శిరీష్ కుందర్ ని ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కవల ఆడ పిల్లలు ఉన్నారు. వీరికి దివా మరియు అన్య అనే పేర్లు పెట్టారు.

సెలీనా జెట్లీ

మంచు విష్ణు డెబ్యూ మూవీ సూర్యం సినిమాలో హీరోయిన్ గా నటించిన సెలీనా జెట్లీ 2012లో ఆస్టేలియన్ ఎంట్రప్రెన్యూర్ పీటర్ హాగ్ ని ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి 2017లో ఇద్దరు మగ కవలలు పుట్టారు. వీరికి ఆర్థర్ హాగ్, షంషేర్ హాగ్ అనే పేర్లు పెట్టారు.

నమిత

తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన నమిత 2017 లో యాక్ట‌ర్ వీరేంద్ర చౌద‌రిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కృష్ణాష్టమి రోజున అంటే ఆగస్టు 19న ఈమెకు కవల పిల్లలు పుట్టినట్టు వెల్లడించింది.

నయనతార

తన చిరకాల ప్రియుడు విఘ్నేష్ శివన్ ను ఈ ఏడాది జూన్ లో వివాహం చేసుకుంది నయన్. ఇంతలోనే ఈమె కవలలకు జన్మనిచ్చినట్టు విఘ్నేష్ శివన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఇద్దరూ మగపిల్లలు అని సమాచారం.

 

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus