Salaar: సలార్ పై అంచనాలు పెరుగుతున్నాయిగా.. వాటిని మించి ఉండనుందా?

  • October 28, 2023 / 06:48 PM IST

ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సలార్ మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ సినిమాకు పని చేస్తున్న టెక్నీషియన్లు సలార్ 100 కేజీఎఫ్ లకు సమానమని చెప్పారని సమాచారం అందుతోంది. సలార్ పై అంచనాలు పెరుగుతుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. ప్రశాంత్ నీల్ గత సినిమాలను మించి ఈ సినిమా ఉండనుందని సమాచారం. ప్రశాంత్ నీల్ ఈ సినిమా కోసం రేయింబవళ్లు కష్టపడుతున్నారని బెటర్ అవుట్ పుట్ కోసం ఆయన ఎంతగానో ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.

సలార్ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా ఈ సినిమా అంచనాలను మించి విజయం సాధిస్తుందేమో చూడాల్సి ఉంది. ప్రభాస్ రెమ్యునరేషన్ 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా ప్రశాంత్ నీల్ 25 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో వాటా తీసుకుంటున్నారని సమాచారం. ప్రభాస్ కు ప్రస్తుతం కెరీర్ పరంగా సలార్ సినిమా సక్సెస్ సాధించడం కీలకం కాగా ఈ సినిమా కనీసం 2000 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

సలార్1 షాకింగ్ ట్విస్ట్ తో ఎండ్ అవుతుందని తెలుస్తోంది. ఈ సినిమాకు కొనసాగింపుగా తెరకెక్కనున్న సలార్2 మూవీ ఏ రేంజ్ లో ఉండనుందో చూడాల్సి ఉంది. ప్రభాస్ భాషతో సంబంధం లేకుండా క్రేజ్ ను పెంచుకున్నారు. ప్రభాస్ ప్రాజెక్ట్ కే సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన అప్ డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఊహలకు అందని విధంగా ఉండనుందని తెలుస్తోంది. ప్రభాస్ సినిమాల ప్లానింగ్ మాత్రం అదుర్స్ అనేలా ఉంది. ప్రభాస్ స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లోనే నటించాలని కొంతమంది ఫ్యాన్స్ భావిస్తున్నారు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus