Mahesh Babu: మహేష్ డ్యాన్స్ పై ప్రముఖ క్రికెటర్ ప్రశంసల వర్షం.. ఆ పాట నచ్చడంతో?

  • March 20, 2024 / 11:37 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబుకు  (Mahesh Babu) ఊహించని స్థాయిలో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే. గుంటూరు కారం (Guntur Kaaram) సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. కుర్చీ మడతబెట్టి సాంగ్ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సినిమాలలో గుంటూరు కారం సినిమా ఒకటి. ఈ సినిమాలో శ్రీలీల (Sreeleela) హీరోయిన్ గా నటించగా ఆమె డ్యాన్స్ స్టెప్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.

కుర్చీ మడతబెట్టి సాంగ్ లో మహేష్ బాబు డ్యాన్స్ స్టెప్స్ కూడా హైలెట్ గా నిలిచాయనే సంగతి తెలిసిందే. టీమిండియా క్రికెటర్, స్పిన్నర్ రవిచంద్రన్ ఈ సినిమాపై ప్రశంసలు కురిపించడం గమనార్హం. మహేష్ బాబు ఎక్స్ట్రార్డినరీ డ్యాన్సర్ అని శ్రీలీల డ్యాన్స్ కు ఫిదా అయ్యానని ఆయన కామెంట్లు చేశారు. కుర్చీ మడతబెట్టి సాంగ్ చూడని వాళ్లు యూట్యూబ్ లో ఆ సాంగ్ చూడాలని రవిచంద్రన్ చెప్పుకొచ్చారు.

ఐపీఎల్ ఎస్.ఆర్.హెచ్ టీంకు ఈ సాంగ్ ఊపు తీసుకొస్తుందని ఆయన వెల్లడించడం గమనార్హం. రవిచంద్రన్ చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుండగా ఆ కామెంట్లు అభిమానుల్లో ఎంతో జోష్ నింపుతున్నాయి. గుంటూరు కారం సినిమా ఓటీటీలో రికార్డ్ స్థాయిలో వ్యూస్ సాధించగా ఈ సినిమా పాటలకు యూట్యూబ్ లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

మహేష్ బాబు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్న గుంటూరు కారం కమర్షియల్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను సైతం ఎంతగానో మెప్పించింది. ఈ సినిమా రిజల్ట్ విషయంలో సంతోషంగా ఉన్నామని మేకర్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే. మహేష్ రాజమౌళి (SS Rajamouli) సినిమాకు సంబంధించి త్వరలో ఆసక్తికర అప్ డేట్స్ రానున్నాయి. ఇప్పటికే జక్కన్న ఈ సినిమాకు సంబంధించి కీలక కీలక విషయాలను వెల్లడించారు.

షరతులు వర్తిస్తాయి సినిమా రివ్యూ & రేటింగ్!

‘డెవిల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?
‘బబుల్ గమ్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus