ఫ్యాన్స్ ఆశలను ఈ స్టార్ హీరోలు నెరవేరుస్తారా?

  • January 2, 2023 / 11:20 AM IST

టాలీవుడ్ స్టార్ హీరోల అభిమానులు తమ ఫేవరెట్ హీరోలకు 2023 సంవత్సరం కూడా కలిసిరావాలని కోరుకుంటున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలంతా ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 2023 జనవరిలో బాలయ్య గోపీచంద్ కాంబో మూవీ, చిరంజీవి బాబీ కాంబో మూవీ రిలీజ్ కానున్నాయి. ఈ రెండు సినిమాలపై ఆడియన్స్ ఎన్నో ఆశలు పెట్టుకోగా ఈ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగింది.

చరణ్ శంకర్ కాంబో మూవీ, ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ, తారక్ కొరటాల శివ కాంబో మూవీ, అల్లు అర్జున్ సుకుమార్ కాంబో మూవీ, పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబో మూవీ, మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబో మూవీ వచ్చే ఏడాది థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. ఈ సినిమాలు తమ ఫేవరెట్ హీరోలకు కెరీర్ బిగ్గెస్ట్ హిట్లుగా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ సినిమాలు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అభిమానుల ఆశలను స్టార్ హీరోలు నెరవేరుస్తారా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఎందరు స్టార్ హీరోలు అభిమానుల అంచనాలను అందుకుంటారో చూడాల్సి ఉంది. ఈ స్టార్ హీరోల సినిమాలన్నీ కలిపితే 2000 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కాయి. అయితే ఈ సినిమాలలో ఏ సినిమాకు హిట్ టాక్ వచ్చినా సులువుగా 1000 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించే ఛాన్స్ అయితే ఉంది.

టాలీవుడ్ డైరెక్టర్లలో ఇప్పటికే చాలామంది డైరెక్టర్లకు పాన్ ఇండియా దర్శకులుగా గుర్తింపు ఉండగా కొందరు దర్శకులు తమకు 2023లో పాన్ ఇండియా దర్శకులుగా గుర్తింపు దక్కుతుందనే నమ్మకంతో ఉన్నారు. ఓటీటీల వల్ల గతంతో పోల్చి చూస్తే పెద్ద సినిమాలకు థియేట్రికల్ కలెక్షన్లు తగ్గాయి. 2023లో విడుదలయ్యే సినిమాలు ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తాయో చూడాల్సి ఉంది.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus