పవన్ కళ్యాణ్ – రానా కాంబినేషన్లో ఓ మూవీ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ అయిన `అయ్యప్పయున్ కోషియమ్` కు ఇది రీమేక్ . సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సంభాషణలు సమకూరుస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి చాలా వరకు షూటింగ్ ను జరిపారు.కానీ కరోనా సెకండ్ వేవ్ తో షూటింగ్ వాయిదా పడింది. ఈ మధ్యనే షూటింగ్ ను ప్రారంభించారు.
కానీ మళ్ళీ బ్రేక్ పడినట్టు వినికిడి. ఈ విషయాన్ని పక్కన పెడితే కెమెరామెన్ ప్రసాద్ మూరెళ్ల ఈ ప్రాజెక్టు నుండీ తప్పుకోవడం పెద్ద చర్చనీయాంశం అయ్యింది. ఆయన ప్లేస్ లో రవి.కె.చంద్రన్ ను రీప్లేస్ చేశారు. దీంతో ..ప్రసాద్ మూరెళ్ల తీసిన భాగాన్ని మళ్లీ కొత్తగా చిత్రీకరించాలని చిత్ర బృందం భావిస్తున్నట్టు సమాచారం. ప్రసాద్ తప్పుకున్న రోజునే క్రియేటివ్ డిఫరెన్సెస్ వలన అతను తప్పుకున్నట్టు టాక్ వినిపించింది. అతని సినిమాటోగ్రఫీ దర్శకుడికి నచ్చకే నిర్మాతలు అతన్ని పక్కన పెట్టినట్టు టాక్ వినిపించింది.
ఓ సందర్భంలో పవన్ కూడా ‘కథ టెంపో మొత్తం మార్చేసారు` అంటూ..ఆవేదన వ్యక్తం చేసారని కూడా ఇన్సైడ్ వర్గాల సమాచారం.ఈ నేపథ్యంలో.. ప్రసాద్ మూరెళ్ల వర్క్ చేసిన సన్నివేశాల్ని ఉంచితే కనుక అతనికి కూడా క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే రీషూట్లకు చిత్ర బృందం సిద్దపడినట్టు సమాచారం. కాబట్టి.. ఈ రీమేక్ ఈ ఏడాది విడుదలయ్యే అవకాశాలు తక్కువే కనిపిస్తున్నాయి.
Most Recommended Video
పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్