కూల్ డైరక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఫిదా మూవీ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. సాయి పల్లవి నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అచ్చమైన తెలంగాణ అమ్మాయిగా అందరి మనసులు దోచుకుంది. విడుదలైన అన్ని థియేటర్లలలో మంచి కలక్షన్స్ సాధిస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ 10 రోజుల్లో (జులై 30 ) ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. షేర్ కూడా బాగానే రాబట్టింది.
31 కోట్ల షేర్ దక్కించుకొని అందరికీ లాభాలను పంచి పెడుతోంది. విదేశాల్లోనూ ఈ చిత్రం విజయవంతంగా రన్ అవుతోంది. ఓవర్సీస్ మార్కెట్లో 1. 6 మిలియన్ డాలర్లను క్రాస్ చేసి 2 మిలియన్ల దిశగా దూసుకుపోతోంది. కొంతకాలంగా విజయం కోసం ఎదురుచూస్తున్న శేఖర్ కమ్ముల, వరుణ్ తేజ్ కి ఫిదా మంచి హిట్ ని ఇచ్చింది. తెలుగు ప్రేక్షకులు మంచి వినోదాన్ని అందించింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.