ఎన్ని సూపర్ హీరో సినిమాలు వచ్చినా.. ఎంతమంది సూపర్ హీరోలు వచ్చినా.. జేమ్స్ బాండ్ సినిమా వస్తోంది అంటే అన్నీ సైడ్‌కి వెళ్లాల్సిందే. ప్రపంచ సినిమాపై ఆ పాత్ర చూపించిన ప్రభావం అలాంటిది. అందుకే ఆ పాత్రను ఎవరు పోషిస్తారా అని సినిమా అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు. అయితే గత కొన్నేళ్లుగా ఈ విషయంలో ఓ చర్చ నడుస్తూనే ఉంది. కొత్త బాండ్ ఎవరు? అనేదే ఆ చర్చ. ఫైనల్‌గా ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసింది. కొత్త బాండ్ ఎవరు అనేది చెప్పేశారు.
‘బాండ్.. జేమ్స్ బాండ్’ గత ఐదేళ్లుగా ఈ మాట కోసం అభిమానులు ఎదురుచూస్తూనే ఉన్నారు. వారి ఎదురుచూపులకు తెరదించుతూ రాబర్ట్ పాటిన్సన్‌ను కొత్త బాండ్‌గా అనౌన్స్ చేశారు. చిత్ర నిర్మాణ సంస్థ అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ‘ట్విలైట్ సాగా’ ఫిల్మ్ సిరీస్, ‘టెనెట్’, ‘బ్యాట్ మ్యాన్’, ‘ది ఒడిస్సీ’ సినిమాలతో రాబర్ట్ పాటిన్సన్ పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు బాండ్ అవుతున్నాడు.
బాండ్ సిరీస్‌లో ‘డాక్టర్ నో’ సినిమాతో మొదలుపెట్టి ‘నో టైమ్ టు డై’ వరకు 25 సినిమాలు వచ్చాయి. చివరిగా 2021లో డేనియల్ క్రెగ్ (Daniel Craig) బాండ్‌గా కనిపించారు. అప్పటికే ఐదుసార్లు బాండ్‌గా కనిపించిన డేనియల్ క్రెగ్ ఆ తర్వాత బాండ్ పాత్ర చేయనని ప్రకటించారు. దీంతో కొత్త జేమ్స్ బాండ్ కోసం వెతుకులాట మొదలైంది. ఈ క్రమంలో టామ్ హార్డీ, జేమ్స్ నార్టన్, హిడల్ స్టన్, జీన్ పేజ్, జాక్ లోడెన్, జోష్ ఓ కార్నర్, కాలమ్ టర్నర్ పేర్లు వినిపించాయి. వారంతా కదనుకుని పాటిన్సన్ పేరు ఖరారు చేశారు.
బాండ్ ఫ్రాంఛైజీ హక్కలను గతేడాది ప్రారంభంలో యాన్ ప్రొడక్షన్స్ నుంచి అమెజాన్ ఎంజీఎం, మైఖేల్ జి విల్సన్, బార్బరా బ్రకోలి దక్కించుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు తదుపరి బాండ్ దర్శకుడిగా డెనిస్ విల్లెన్యువ్‌ని ప్రకటించారు. ‘డ్యూన్’ సినిమాలతో ఆయన ఫేమస్. ప్రస్తుతం చేస్తున్న ‘డ్యూన్ 3’ తర్వాత బాండ్ సినిమా స్టార్ట్ అవుతుంది అని చెబుతున్నారు.