నెలకోసారి సినిమా గురించి ఏదో విషయం చెబుతూ, లీక్ ఇస్తూ.. నిత్యం ప్రజల నోళ్లలో నానేలా చూసుకుంటున్నారు ‘వారణాసి’ సినిమా టీమ్. ఎప్పుడో షూట్ చేసిన ఇంటర్వ్యూలను అప్పుడప్పుడు రిలీజ్ చేస్తూ ప్రమోషనలల్ స్ట్రాటజీ బాగా ఫాలో అవుతున్నారు. ఈ నెలలో ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ లేదు. మొన్నీమధ్య మహేష్‌బాబు పుట్టిన రోజు సందర్భంగా కూడా రెండు పోస్టర్లు రిలీజ్ చేశారు. సినిమా టీమ్ ఒక్కొక్కరు ఒక్కో క్రిప్టిక్ టెక్స్ట్‌తో ఆ పోస్టులను షేర్ చేశారు.
అయితే, ఇప్పుడు సినిమా నుండి ఓ అప్‌డేట్ వచ్చింది. అయితే ఇది కూడా అధికారికంగా కాదు అనధికారికంగానే. ఈ సినిమాలో మొత్తం ఆరు పాటలు ఉంటాయట. దీంతో ఈ పాయింట్ ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఓ సినిమాలో ఆరు పాటలు ఉన్నట్లు చూడలేదు. దీంతో ఇప్పుడు ఈ విషయం ఆసక్తికరంగా మారింది. అయితే మహేష్‌బాబును ఆ ఆరు పాటల్లోనూ చూస్తామా? లేక కొన్ని పాటల్లోనే చూస్తామా అనేది తెలియడం లేదు. అయితే ఇక్కడో విషయం తెలిసింది.
అదే ఈ సినిమా నుండి తొలి సింగిల్ రాకకు సర్వం సిద్ధమైంది. ఈ మేరకు సినిమా సన్నిహిత వర్గాలు సమాచారం అందించాయి. అయితే అది వినాయకచవితికా, లేక ఇంకేదైనా స్పెషల్ డే కోసమా అనేది చూడాలి. అలాగే ఈ పాట రిలీజ్‌ను నార్మల్‌గానే చేస్తారా? లేక అంతర్జాతీయ స్థాయిలో చేస్తారా అనేది చూడాలి. మొన్నీమధ్య ‘రామాయణ’ సినిమా ట్రైలర్‌ను కూడా నేరుగా రిలీజ్ చేయకుండా అంతర్జాతీయ స్థాయి విడుదల అంటూ ‘స్పైడర్ మ్యాన్’ సినిమాతో రిలీజ్ చేశారు.
మరి ఈ విషయంలో పబ్లిసిటీ కింగ్ రాజమౌళి ఏం ప్లాన్ చేస్తున్నారో చూడాలి. ఇప్పుడు సినిమా నుండి తొలి పాట వచ్చే క్రమంలో సినిమా రిలీజ్ విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే వచ్చే ఏడాది ఏప్రిల్ 7న అని చెప్పారు. అయితే రాజమౌళి ఇలాంటి విషయాల్లో మాట మీద నిలబడరు అని టాక్.