Waltair Veerayya: ‘వీరయ్య’ పాట వెనుక ఏం జరిగిందంటే?

  • January 6, 2023 / 12:56 PM IST

సినిమాల టైటిల్‌ సాంగ్‌ అంటే.. కేవలం పాట మాత్రమే కాదు, అదొక ఎమోషన్‌ అని చెప్పొచ్చు. సినిమాలో హీరో హీరోయిజాన్ని వివరిస్తూ ఈ పాట సాగుతుంది. అయితే అంతర్లీనంగా హీరో పాత్రధారి గురించి అన్యాపదేశంగా చెబుతుంటారు. గతంలో చాలా సినిమాల్లో ఇదే జరిగింది. అతను నిజజీవితంలో ఓ స్టార్‌ అని చెప్పేలా పాట లిరిక్స్‌ ఉంటాయి. దీంతో అభిమానులు ఆ పాటను తెగ ఇష్టపడతారు. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి అభిమానులు అలా ముచ్చటపడుతున్న పాట ‘వాల్తేరు వీరయ్య’ టైటిల్‌ ట్రాక్‌. ఈ పాట రచయిత చంద్రబోస్‌ ఇటీవల ఆ గీతం గురించి ఓ మీడియాతో మాట్లాడారు.

‘వాల్తేరు వీరయ్య’ సినిమాలోని ‘భగ భగ… ’ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అనురాగ్‌ కులకర్ణి ఆలపించిన ఆ గీతాన్నిదేవిశ్రీప్రసాద్‌ స్వరపరిచారు. అన్నట్లు ఈ పాట విషయంలో శాస్త్రపరమైన చర్చ కూడా వచ్చింది కూడా. ‘‘ఎన్నో అకృత్యాలు, అరాచకాలు చేస్తూ అమాయకపు ప్రజల ప్రాణాల్ని తీసే రాక్షసుడిని సంహరించే క్రమంలో కథానాయకుడు ప్రజల పాలిట దేవుడు అవుతాడు. రాక్షస సంహారం సందర్భంలో వచ్చే పాటే ఈ ‘భగ భగ’. ఈ పాటను చంద్రబోస్‌ మూడు రోజులపాటు రాశారట.

ఆ పాట లిరిక్స్‌ ఇదిగో…

భగ భగ భగ భగ భగ భగ భగ భగ మండే
మగ మగ మగ మగ మగ మగ మగాడురా వీడే
జగ జగ జగ జగ జగ చెడు జగాన్ని చెండాడే
ధగ ధగ ధగ ధగ ధగ ధగ జ్వలించు సూరీడే
అగాధ గాథల అనంతలోతుల సముద్ర సోదరుడే వీడే
వినాశకారుల శ్మశానమౌతాడే
తుఫాను అంచున తపస్సు చేసే వశిష్ఠుడంటే అది వీడే
తలల్ని తీసే విశిష్డుడే వీడే… // వీరయ్యా… //

మృగ మృగ మృగ మృగ మృగ మృగ మృగాన్ని వేటాడే
పగ పగ పగ ప్రతిధ్వనించే శతఘ్నిరా వీడే
భుగ భుగ భుగ భుగ భుగ భుగ విషాన్ని మింగాడే
తెగ తెగ తెగ తెగించివచ్చే త్రిశూలమయ్యాడే
ఎకా ఎకా ఎకి యముండు రాసే కవిత్వమంటే అది వీడే
నవ శకాన ఎర్రని కపోతమే వీడే
తరాలు చూడని యుగాలు చూడని సమర్థ శిఖరం అది వీడే
తనొంక తానే తలెత్తి చూస్తాడే… // వీరయ్యా… //

ఢం ఢం ఢమ ఢమ అగ్నివర్షమై అడుగులేసిన అసాధ్యుడే
భం భం బడ బడ మృత్యు జననమై ముంచుకొచ్చిన అనంతుడే
రం రం రగ రగ శౌర్య సంద్రమై ఆక్రమించిన అమర్త్యుడే
ధం ధం దబ దబ యుద్ధ శకటమై ఎగిరిదూకిన అభేద్యుడే
తం తం తక తక తిమిర నేత్రమై ఆవరించిన త్రినేత్రుడే
గం గం గడ గడ మరణ శంఖమై మారుమ్రోగిన ప్రశాంతుడే // వీరయ్యా//

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus