విశ్వక్ సేన్ హీరోగా కయాడు లోహర్ హీరోయిన్ గా అనుదీప్ కేవీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఫంకీ'(Funky). ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. టీజర్, ట్రైలర్ వంటివి ఆకట్టుకున్నాయి. సినిమాపై బజ్ క్రియేట్ అయ్యేలా చేశాయి. అందువల్ల బిజినెస్ కూడా డీసెంట్ గా జరిగింది. ‘అన్నపూర్ణ స్టూడియోస్’ ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసింది.
ఓవర్సీస్ లో అయితే నాగవంశీ తన ఫ్రెండ్స్ ద్వారా రిలీజ్ చేసుకున్నారు.కానీ మొదటి రోజు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. సినిమాలో కామిడీ ఉన్నప్పటికీ.. కథ, కథనాలు ఏమాత్రం ఇంట్రెస్టింగ్ గా లేవు అంటూ ఆడియన్స్ కొట్టిపారేశారు. అయినప్పటికీ మొదటి వీకెండ్ ని బాగానే క్యాష్ చేసుకుంది. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
| నైజాం | 1.38 cr |
| సీడెడ్ | 0.29 cr |
| ఆంధ్ర(టోటల్) | 0.83 cr |
| ఏపీ + తెలంగాణ(టోటల్) | 2.5 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.25 cr |
| ఓవర్సీస్ | 1.07 cr |
| వరల్డ్ వైడ్(టోటల్) | 3.82 cr |
‘ఫంకీ’ సినిమాకి వరల్డ్ వైడ్ గా రూ.11.5 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. సో బ్రేక్ ఈవెన్ కొరకు రూ.12 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి ఈ సినిమా రూ.3.82 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.7.47 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.8.18 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.