Tollywood : సినిమా టైటిల్స్ పై కన్నెర్ర చేస్తున్న సెన్సార్ బోర్డు… టాలీవుడ్ లో టైటిల్స్ తారుమారు..!

టాలీవుడ్‌లో చిన్న సినిమాల నిర్మాతలను ఇప్పుడు ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న అంశం, సెన్సార్ దశలో టైటిల్ మార్పులు. సినిమా షూటింగ్ పూర్తి చేసి, పోస్టర్లు, టీజర్లు, ఇంటర్వ్యూలతో ఒక పేరును బ్రాండ్‌గా నిలబెట్టిన తర్వాత, సరిగ్గా సెన్సార్ సర్టిఫికేట్ సమయంలో పేరు మార్చాల్సి రావడం పెద్ద దెబ్బగా మారుతోంది. ఈ సమస్యను తాజాగా యంగ్ హీరోల సినిమాలు తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి.

Tollywood

ఈ జాబితాలో ముందుగా నిలిచేది ‘హే బల్వంత్’. సుహాస్ మరియు శివానీ నాగారం జంటగా నటించిన ఈ చిత్రం మొదట ‘హే భగవాన్ ‘అనే పేరుతోనే ప్రమోషన్స్ జరుపుకుంది. అయితే దేవుడి పేరుతో ఉన్న టైటిల్ వల్ల కొందరి భావోద్వేగాలు దెబ్బతినే అవకాశం ఉందని సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలిపింది. దీంతో విడుదలకు కేవలం కొన్ని రోజుల ముందు చిత్ర బృందం టైటిల్‌ను ‘హే బల్వంత్’ గా మార్చాల్సి వచ్చింది. ఇప్పటికే పాత పేరుతోనే ప్రమోషన్లు జరగడంతో, ఈ మార్పు ప్రేక్షకుల్లో గందరగోళం సృష్టిస్తుందేమోనన్న ఆందోళన యూనిట్‌లో కనిపిస్తోంది.

ఇక ‘నవాబ్స్ కేఫ్’ కూడా ఇదే కోవలోకి వస్తుంది. శివ కందుకూరి నటించిన ఈ సినిమా మొదట ‘చాయ్ వాలా’ అనే పేరుతో రూపొందింది. కానీ ఆ టైటిల్ సామాజికంగా సెన్సిటివ్‌గా మారే అవకాశం ఉందని బోర్డు సూచించడంతో, చివరకు ‘నవాబ్ కేఫ్’ అనే పేరుతో ఫిబ్రవరి 20న థియేటర్లలోకి రానుంది. తండ్రి-కొడుకుల మధ్య సాగే ఎమోషనల్ డ్రామాగా ఈ మూవీ విడుదల అవ్వనుంది.

ఇటీవలే విడుదలైన ‘వనవీర’ పరిస్థితి కూడా ఇలాంటిదే. మొదట ‘వానర’ అనే టైటిల్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి, పేరు పురాణాల్ని గుర్తు చేసేలా ఉందని, అందులోని కొన్ని అంశాలు సున్నితమైనవని సెన్సార్ అభ్యంతరం చెప్పింది. ఫలితంగా చివరి నిమిషంలో టైటిల్ మార్చాల్సి వచ్చింది. ప్రమోషన్లపై పెట్టిన పెట్టుబడి వృథా అయిందని దర్శకుడు బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

మొత్తంగా చూస్తే, చిన్న సినిమాలకు టైటిల్ అనేది కేవలం పేరు కాదు – అదే గుర్తింపు, అదే మార్కెటింగ్. అలాంటి కీలక సమయంలో సెన్సార్ నిబంధనల వల్ల పేరు మార్పులు జరగడం, చిన్న నిర్మాతలకు ఆర్థికంగా, వ్యూహాత్మకంగా పెద్ద భారంగా మారుతోంది.

Vishwambhara : విశ్వంభర సినిమాతో UV క్రియేషన్స్ నెం.1 గా నిలబడబోతుంది : నిర్మాత ధీరజ్

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus