సోషల్ మీడియాలో గంగవ్వకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈక్రేజ్ తోనే ఆమెకి బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొనే ఛాన్స్ వచ్చింది. అయితే ఎక్కువ రోజులు హౌస్ లో ఉండలేక.. అనారోగ్యం కారణంగా బయటకి వచ్చేసింది గంగవ్వ. హౌస్ లో ఉన్నన్ని రోజులు బిగ్ బాస్, హోస్ట్ నాగార్జున.. గంగవ్వను స్పెషల్ గా ట్రీట్ చేశారు. ఆమె కోసం ఓ ఇల్లు కూడా కట్టించి ఇచ్చారు. ఇదిలా ఉండగా.. నాగార్జున నటించిన ‘వైల్డ్ డాగ్’ సినిమా విడుదలకు సిద్ధమవుతుండడంతో రకరకాల ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టారు.
ఈ క్రమంలో నాగార్జున.. గంగవ్వని కూడా ఈ ప్రమోషన్స్ లో ఇన్వాల్వ్ చేయాలని అనుకున్నాడు. దీంతో ఆమెకి ఫోన్ చేయగా.. అంతకుముందే నాగార్జున వాయిస్ తో ఫేక్ కాల్స్ రావడంతో.. నాగార్జున పేరు చెప్పి పదే పదే కాల్స్ చేస్తున్నారని.. మరోసారి ఫోన్ చేస్తే కేసు పెడతానని నాగార్జునను ఫోన్ లో బెదిరించింది గంగవ్వ. వెంటనే నాగార్జున ‘నా వాయిస్ గుర్తుపట్టలేదా..?’ అని అడగగా.. నాగార్జునలా మిమిక్రీ చేసేవాళ్లను చాలామందిని చూశానని చెప్పిందట. దీంతో నాగ్ బిగ్ బాస్ మెమొరీని చెప్పి తనే నాగార్జున అని ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది. ఇదంతా కూడా ప్రమోషన్స్ లో భాగంగానే చేశారని తెలుస్తోంది.
ఆ తరువాత నాగార్జునను కలవడానికి ఆయన ఉన్న ప్లేస్ కి చేరుకొని కాసేపు ముచ్చటించింది గంగవ్వ. ఈ క్రమంలో బిగ్ బాస్ షో చేస్తున్నప్పుడు ఎప్పుడైనా కోపం వచ్చిందా..? అని గంగవ్వ.. నాgangగార్జునను ప్రశ్నించింది. దానికి నాగ్ కోపం ఏం లేదని.. కానీ వేరే కంటెస్టెంట్ లు చేసే పనుల వలన వాళ్లపై కోపం ఉండేదని.. పేర్లు మాత్రం చెప్పనని నాగార్జున అన్నారు . అనంతరం ‘వైల్డ్ డాగ్’ సినిమా గురించి మాట్లాడుతూ.. ఇది సీరియస్ గా సాగే సినిమా కాదని.. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయని చెప్పారు. ఏప్రిల్ 2న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
Most Recommended Video
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!
ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లు ఒకప్పుడు స్టార్ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్లుగా చేసిన వాళ్ళే..!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!