కెరీర్ ప్రారంభంలో గ్లామర్ పాత్రలు పోషించిన సమంత.. ‘ఏమాయ చేసావె’ ‘బృందావనం’ ‘దూకుడు’ ‘ఈగ’ ‘అత్తారింటికి దారేది’ వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అటు తరువాత కొన్ని ప్లాప్ లు పలకరించినప్పటికీ.. ఈమె స్టార్ స్టేటస్ కు ఏమాత్రం ఎఫెక్ట్ కాలేదు. వెంటనే ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ ‘తేరి'(తెలుగులో పోలీస్) ’24’ చిత్రాలతో కోలుకుంది. ఇక నాగచైతన్యను పెళ్లి చేసుకుని సమంత అక్కినేనిగా మారిన తరువాత కేవలం గ్లామర్ పాత్రలను తగ్గించి.. పూర్తిగా కథా ప్రాధాన్యత కలిగిన సినిమాలనే ఎంపిక చేసుకుంటూ వస్తుంది. ఈ క్రమంలో ‘రంగస్థలం’ ‘మహానటి’ ‘మజిలీ’ ‘ఓ బేబీ’ వంటి సినిమాల్లో నటించి సూపర్ స్టార్ గా ఎదిగింది. త్వరలో గుణశేఖర్ ‘శాకుంతలం’ అలాగే ‘ఫ్యామిలీ మెన్ సీజన్2’ వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది సమంత.
అసలు ఆమె గురించి ఇంత ప్రసంగం ఎందుకు అనే డౌట్ మీకు రావచ్చు. అయితే ఫిబ్రవరి 26తో ఈమె ఇండస్ట్రీకి ఎంట్రీ 14 ఏళ్ళు కావస్తోంది. 2010 ఫిబ్రవరి 26న ఈమె నటించిన ‘ఏమాయ చేసావె’ చిత్రం విడుదలయ్యింది. ఈ నేపథ్యంలో ఈమె 14 ఏళ్ళ కెరీర్లో సమంత రిజెక్ట్ చేసిన సినిమాలను ఓ లుక్కేద్దాం రండి :
1) కడలి
2) ఎవడు
3) ఐ
4) బ్రూస్ లీ
5) నిన్ను కోరి
6) యూ టర్న్(హిందీ రీమేక్ లో నటించడానికి నొ చెప్పింది)
7) ఎన్టీఆర్ కథానాయకుడు(ఓ పాత్రకి ఆఫర్ వస్తే రిజెక్ట్ చేసింది)
8) స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్(హిందీ)
9) అశ్విన్ శరవణన్(గేమ్ ఓవర్ డైరెక్టర్) ప్రాజెక్టు
10) పుష్ప