‘గంగోత్రి’ కావ్య ఫోటోలు వైరల్.. అదరకొట్టేసింది..!

  • July 5, 2020 / 03:00 PM IST

‘వల్లంకి పిట్టా.. వల్లంకి పిట్టా’ అంటూ ‘గంగోత్రి’ సినిమాలో ఆడి పాడిన చిన్నారి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈమె పేరు కావ్య. ఆ చిత్రంలో చిన్నప్పటి హీరోయిన్ పాత్రలో కావ్య కనిపించింది. అయితే ఆ చిత్రం వచ్చి 17 ఏళ్ళు పూర్తయ్యింది. మరి ఆ చిన్నారి ఇప్పుడు ఎలా ఉంది? ఏం చేస్తుంది? అనే విషయాలు తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తిగా ఉండే ఉంటుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు.. కొంతమంది ఏదో ఒక రకంగా ఇండస్ట్రీలోనే సెటిల్ అయిపోతారు.

అలీ, కమల్ హాసన్, మీనా వంటి వారి దగ్గరనుండీ మొదలుపెడితే ఈ లిస్ట్ చాలా పెద్దదే. అయితే కావ్య మాత్రం చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చినా సినిమాల్లో కొనసాగలేదు. స్టడీస్ వైపు మళ్లింది. పూణెలో బి.ఎ.ఎల్.ఎల్.బి కంప్లీట్ చేసింది. ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు క్లాసికల్ డ్యాన్స్ కూడా నేర్చుకుంది. పలు నాట్యప్రదర్శనలు కూడా ఇచ్చిందట ఈ బ్యూటీ. ఈ మధ్యనే ఈమె పూణె నుండీ హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యింది. తిరిగి సినిమాల్లోకి నటించాలి అనే ఇంట్రెస్ట్ ఈ బ్యూటీకి కూడా ఉందట.

అలా అని హీరోయిన్ పాత్రలు చేసేంత కష్టపడలేనని.. అంత పెద్ద ఆశ కూడా లేదని చెప్పిన కావ్య.. హీరో, హీరోయిన్లకు చెల్లెలి పాత్రల్లోనో లేక కథా ప్రాధాన్యత ఉన్న పాత్రలోనైనా నటించాలని ఆశపడుతుందట. అందాల ప్రదర్శనకు కూడా ఈమె నో అంటుంది. ఇక ఈ మధ్యకాలంలో ఈమె ఓ ఫోటో షూట్లో పాల్గొంది. ఆమె పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

Most Recommended Video

భానుమతి & రామకృష్ణ సినిమా రివ్యూ & రేటింగ్!
సినిమాల్లోకి రాకముందు మన హీరోయిన్స్ ఎలా ఉంటారో చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..!
అట్టర్ ఫ్లాప్ సీజన్ అంటే ఇదేనేమో..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus