బాయ్స్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి నటి జెనీలియా అనంతరం తెలుగులో పలు సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. సత్యం’ ‘బొమ్మరిల్లు’ ‘ఢీ’ ‘సై’ ‘రెడీ’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ మారిపోయింది. ఇక ముఖ్యంగా బొమ్మరిల్లు సినిమాలో తన నటన ద్వారా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకొంది. ఈ సినిమా ద్వారా అందరికీ జెనీలియా హాసినిగా గుర్తుండిపోయింది. ఎన్టీఆర్, అల్లు అర్జున్, వెంకటేష్, రాంచరణ్ వంటి స్టార్ హీరోల సరసన కూడా నటించి మెప్పించింది.
ఆ తరువాత మన హాసిని సినిమాలను తగ్గించి బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ని 2011లో వివాహం చేసుకుంది. అయినా ఈ భామ కు సౌత్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు. తాజాగా 2022 లో వచ్చిన ‘వేద్’ సినిమా ద్వారా నటిగా కొత్త ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. ఇకపోతే జెనీలియా ఎప్పటికప్పుడు లేటెస్ట్ ట్రెండ్, ఫ్యాషన్స్ ఫాలో అవుతూ.. స్టైలిష్ అండ్ గ్లామరస్ ఫోటోషూట్లతో నెటిజన్లను అలరిస్తుంటుంది..ఈ అమ్మడు (Genelia) షేర్ చేసే పిక్స్ సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
‘సలార్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?!
నయన్ విఘ్నేష్ మధ్య విబేధాలకు అదే కారణమా.. అసలేమైందంటే?
నిశ్చితార్థం చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్.. వరుడి బ్యాగ్రౌండ్ ఇదే!