ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ‘సలార్’ వచ్చింది. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం ‘సలార్ పార్ట్ 1 : సీజ్ ఫైర్’ పేరుతో 2023 డిసెంబర్ 22న రిలీజ్ అయ్యింది. ‘హోంబలే ఫిలింస్’ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. టీజర్, ట్రైలర్స్ సో సోగానే ఉన్నా, పాటలు కూడా జస్ట్ ఓకే అనిపించినా, సినిమా పై మాత్రం మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టే ఈ సినిమా పాజిటివ్ టాక్ ను రాబట్టుకుంది.
దీంతో మొదటి వారం అద్భుతంగా కలెక్ట్ చేసింది. అయితే హిందీలో పోటీగా షారుఖ్ ఖాన్ ‘డంకీ’ రిలీజ్ అవ్వడంతో పెద్ద టార్గెట్ అయితే సెట్ చేయలేకపోయింది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే:
నైజాం | 77.06 cr |
సీడెడ్ | 22.21 cr |
ఉత్తరాంధ్ర | 17 cr |
ఈస్ట్ | 10.02 cr |
వెస్ట్ | 7.11 cr |
గుంటూరు | 9.27 cr |
కృష్ణా | 7.40 cr |
నెల్లూరు | 4.77 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 148.84 cr |
కర్ణాటక | 22.65 cr |
తమిళనాడు | 11.47 cr |
హిందీ | 65 cr |
కేరళ | 6.89 cr |
ఓవర్సీస్ | 64.5 cr |
రెస్ట్ | 6.7 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 326.05 cr (అన్ని వెర్షన్లు కలుపుకుని) |
‘సలార్ పార్ట్ 1: సీజ్ ఫైర్’ (Salaar) చిత్రానికి రూ.336.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.338 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ రూ.326.05 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేసింది. రూ.11.95 కోట్ల నష్టాలతో అబౌవ్ యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది ఈ మూవీ.
ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!
ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!