Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

ఘట్టమనేని కుటుంబం నుంచి థర్డ్ జనరేషన్ హీరోగా జయకృష్ణ ఘట్టమనేని (Ghattamaneni Jaya Krishna) అరంగేట్రం చేశాడు. ‘ఆర్ఎక్స్ 100’, ‘మంగళవారం’ వంటి సెన్సేషనల్ చిత్రాలను తెరకెక్కించిన అజయ్ భూపతి దర్శకత్వంలో ‘వైజయంతి మూవీస్’ బ్యానర్‌లో జయకృష్ణ తన మొదటి సినిమా చేశాడు. అయితే ‘శ్రీనివాస మంగాపురం’ పెద్ద డిజాస్టర్ అయ్యింది. మొదటి సినిమా తీవ్రంగా నిరాశపరచడం ఒక ఎత్తు అయితే.. దానిని జయకృష్ణ చిన్నాన్న అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రమోట్ చేయలేదనే అసంతృప్తి ఘట్టమనేని అభిమానుల్లో ఎక్కువగా కనిపించింది.

Ghattamaneni Jaya Krishna

బహుశా అందుకేనేమో.. మహేష్ బాబు పెదనాన్న ఆదిశేషగిరి రావు ‘ఘట్టమనేని ఫ్యామిలీకి జయకృష్ణే ఫ్యూచర్’ అంటూ ఓ సెన్సేషనల్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. అది కాస్తా మహేష్ బాబు తనయుడు గౌతమ్ డెబ్యూకి కౌంటర్ వేసినట్లుగా మహేష్ అభిమానులు భావించారు. ఆ తర్వాతి సంగతి అందరికీ తెలిసిందే. అయితే జయకృష్ణ రెండవ సినిమాపై మహేష్ బాబు కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. ‘మైత్రీ మూవీ మేకర్స్’, ‘ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్’ వంటి టాప్ బ్యానర్లలో జయకృష్ణ సినిమాలు చేసేలా మహేష్ బాబు రిఫర్ చేశారట.

ఈ క్రమంలో జయకృష్ణ తన తదుపరి సినిమాను ‘మైత్రీ మూవీ మేకర్స్’లో చేసే అవకాశం ఎక్కువగా ఉంది. దీనికి ‘బేబీ’ ఫేమ్ సాయి రాజేష్ దర్శకత్వం వహించనున్నారని సమాచారం. ప్రస్తుతం సాయి రాజేష్ ‘బేబీ’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. దానికి కూడా ఆయనే దర్శకుడు. ఇప్పుడు జయకృష్ణ సినిమాకు సంబంధించిన కథ విషయంలో కూడా సాయి రాజేష్ వర్క్ మొదలుపెట్టినట్లు వినికిడి. త్వరలోనే ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది.

‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus