టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అతడు’ ‘ఖలేజా’ తర్వాత రూపొందిన మూవీ ‘గుంటూరు కారం’. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీలీల హీరోయిన్ గా నటించగా మరో హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా స్పెషల్ రోల్ చేసింది. తమన్ సంగీత దర్శకుడు. జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే నెగిటివ్ టాక్ ను మూటగట్టుకుంది.
అయినప్పటికీ కలెక్షన్స్ బాగానే వచ్చాయి.కానీ పండుగ సెలవులు ముగిశాక మళ్ళీ కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. అయినా బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది ఈ మూవీ. ఒకసారి 3 వీక్స్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 33.56 cr |
సీడెడ్ | 9.66 cr |
ఉత్తరాంధ్ర | 12.42 cr |
ఈస్ట్ | 10.06 cr |
వెస్ట్ | 5.97 cr |
గుంటూరు | 8.26 cr |
కృష్ణా | 6.27 cr |
నెల్లూరు | 3.50 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 89.70 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 6.46 cr |
ఓవర్సీస్ | 14.72 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 110.88 cr (షేర్) |
‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమాకు రూ.130.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.131 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 వారాలు పూర్తయ్యేసరికి రూ.110.88 కోట్ల షేర్ ను రాబట్టింది. అయితే బ్రేక్ ఈవెన్ కి ఇంకా రూ.20.12 కోట్ల షేర్ ను రాబట్టాలి. అది పూర్తిగా అసాధ్యమే. కానీ ఇప్పటివరకు నెగిటివ్ టాక్ తో బాగానే కలెక్ట్ చేసింది ఈ మూవీ అని చెప్పొచ్చు.
‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!
‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!