Jyothi Rai: భర్తతో విడిపోయి డైరెక్టర్ తో కమిట్ అయ్యిందట.. నటి జ్యోతి రాయ్ షాకింగ్ పోస్ట్!

స్టార్ మా లో టెలికాస్ట్ అయ్యే గుప్పెడంత మనసు సీరియల్‌లో జగతి పాత్రతో ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరైంది. ఈమె కన్నడ నటి అయినప్పటికీ తెలుగులోనే మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది.గుప్పెడంత మనసు సీరియల్లో హీరో రిషి పాత్ర పోషిస్తున్న ముఖేష్ కి తల్లిగా.. ఈమె కనిపిస్తుంది. చిన్నప్పుడే తన కొడుక్కి దూరమై.. ఆ తర్వాత ఎదురుగా ఉన్నా.. అతను అసహ్యించుకుంటుంటే … కృంగిపోయే తల్లిగా ఈమె కనిపిస్తుంది.

ఈ పాత్ర పై ప్రేక్షకుల్లో చాలా సింపతీ నెలకొంది. అయితే (Jyothi Rai) జ్యోతి రాయ్ .. పర్సనల్ లైఫ్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో డిస్కషన్లు మొదలయ్యాయి. ఈమెకి పెళ్లై ఓ బాబీ ఉన్న సంగతి తెలిసిందే. విషయం ఏంటి అంటే.. ఈమె తన భర్తతో విడిపోయింది అంటూ చాలా రోజుల నుండీ ప్రచారం జరుగుతుంది. దీంతో స్వయంగా జ్యోతి రాయ్ క్లారిటీ ఇచ్చేసింది. సోషల్ మీడియాలో చాలా యాక్టిివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే.

ఓ బిడ్డకు తల్లైనప్పటికీ ఈమె అందం చెక్కు చెదరలేదు. అందుకే సోషల్ మీడియాలో హీరోయిన్ల మాదిరి ఈమె అందమైన ఫోటోలు షేర్ చేస్తుంది. ఇదే క్రమంలో ఈమె సురేష్ అనే డైరెక్టర్ తో సన్నిహితంగా దిగిన ఫోటోలను షేర్ చేసింది. దీంతో ఇతనితో ప్రేమలో ఉన్నట్టు అందరికీ అర్థమైంది. అలాగే సురేష్ తో లైఫ్ హ్యాపీగా ఉందని కూడా ఈమె చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ఓ నెటిజన్ మేడం మీరు కమిటెడా..? అని అడగ్గా సురేష్ పేరుని ట్యాగ్ చేసింది.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus