Hamida: కన్నీళ్లు పెట్టుకున్న హమీదా.. కారణాలివే?

బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షో సీజన్ 5 లాంఛ్ ఎపిసోడ్ కు కొన్నిరోజుల ముందే ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్లకు సంబంధించిన వివరాలు లీక్ అయ్యాయి. అయితే హమీదా బిగ్ బాస్ షోలో పాల్గొంటున్నారని మాత్రం ఎక్కడా ప్రచారం జరగలేదు. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయడంతో పాటు శ్రీరామచంద్రతో లవ్ ట్రాక్ ద్వారా హమీదా వార్తల్లో నిలిచారు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న హమీదా మాట్లాడుతూ

బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్ కావాలని అనుకున్నానని కానీ కెప్టెన్ కాకుండానే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చానని హమీదా కన్నీళ్లు పెట్టుకున్నారు. బిగ్ బాస్ షో ద్వారా నా బలం ఏంటో తెలుసుకున్నానని హమీదా అన్నారు. బిగ్ బాస్ హౌస్ లో అక్కడ జరిగే పరిస్థితుల వల్ల మారిపోతారని హమీదా చెప్పుకొచ్చారు. సిరి, షణ్ముఖ్, జెస్సీ ఒక గ్రూప్ అని షణ్ముఖ్ తొలివారం నుంచి గేమ్ ఆడటం లేదని హమీదా పేర్కొన్నారు.

శ్రీరామచంద్ర బిగ్ బాస్ విన్నర్ కావాలని కోరుకుంటున్నానని శ్రీరామచంద్రకు మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువని హమీదా చెప్పుకొచ్చారు. తనకు, శ్రీరామ్ కు మధ్య మంచి బాండింగ్ ఉందని ఆ బాండింగ్ కు తాను ప్రేమ అని పేరు పెట్టనని హమీదా వెల్లడించారు. శ్రీరామచంద్రతో కనెక్ట్ కావడం సర్ప్రైజింగ్ గా జరిగిందని హమీదా పేర్కొన్నారు.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus