ప్రేమకథా చిత్రాలకి ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. కరెక్ట్ గా తీస్తే క్లాసిక్స్ అవుతాయి. వాటికి ఎంటర్టైన్మెంట్ ను జోడిస్తే బ్లాక్ బస్టర్స్ గా నిలుస్తాయి.ప్రెజెంట్ ట్రెండ్ ని బట్టి చూస్తే..జెంజి కిడ్స్ సైతం ఎంటర్టైన్మెంట్ తో రూపొందే సినిమాలని ఇష్టపడుతున్నారు. సోషల్ మీడియాలో అయితే వాటిని తెగ మోసేస్తున్నారు అనే చెప్పాలి. అందుకే మేకర్స్ సైతం వినూత్నమైన ప్రేమకథలు రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రస్తుతం ‘హన్సి ప్రొడక్షన్స్'(Hansi Productions) సంస్థ కూడా అదే పంధాలో ముందుకు సాగాలని డిసైడ్ అయ్యింది. ఈ నేపథ్యంలో తొలి ప్రయత్నంలో ఒక ఎంటర్టైన్మెంట్ తో కూడుకున్న ఓ వినోత్నమైన ప్రేమకథని తెరకెక్కించేందుకు రెడీ అయ్యింది. ఈరోజు పూజా కార్యక్రమాలతో తమ కొత్త సినిమాని ఘనంగా ప్రారంభించింది.శనివారం నాడు నిర్వహించిన ఈ పూజా కార్యక్రమాలకి చిత్ర బృందంతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యి తమ బెస్ట్ విషెస్ తెలియజేశారు.
ఇక పూజా కార్యక్రమాలు అనంతరం… ముహూర్తపు షాట్‌కు శ్రీధర్ పెద్దిరెడ్డి క్లాప్ కొట్టగా, స్రవంతి పెద్దిరెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నిర్మాత శ్రీ హన్సిక పెద్దిరెడ్డి దర్శకుడికి స్క్రిప్ట్‌ను అందజేశారు.ఈ సందర్భంగా నిర్మాత శ్రీ హన్సిక పెద్దిరెడ్డి మాట్లాడుతూ…”సినిమా అంటే నాకు కేవలం వ్యాపారం మాత్రమే కాదు, ఒక కల మరియు బాధ్యత. అందుకే నా అభిరుచికి తగ్గట్టుగా ‘హన్సి ప్రొడక్షన్స్’ సంస్థపై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్దమయ్యాం.
ఇదొక స్వచ్ఛమైన ప్రేమకథ. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా మెచ్చేలా వినోదాన్ని మేళవించి రూపొందించబోతున్నాం. కొత్త వారితో పాటు అనుభవజ్ఞులైన టెక్నీషియన్లు కూడా ఈ సినిమాకి పనిచేయబోతున్నారు. హై టెక్నికల్ వాల్యూస్ తో ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాం” అంటూ చెప్పుకొచ్చారు.
త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.