గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటీ రెడ్డి హీరోగా డెబ్యూ ఇస్తూ ‘జూనియర్'(Junior) అనే సినిమా చేశాడు. ‘వారాహి చలన చిత్ర’ బ్యానర్ పై సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. రాజమౌళి వంటి స్టార్స్ ముందుకొచ్చి ప్రమోషన్ చేశారు.ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా కొంతమంది స్టార్స్ వచ్చి డబ్బా కొట్టారు. అయితే 2025 జూలై 18న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.
హీరోయిన్ శ్రీలీల గ్లామర్, సీనియర్ హీరోయిన్ జెనీలియా నటన ఆకట్టుకున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతంలో రూపొందిన పాటలు ‘వైరల్ వయ్యారి’ పాట సినిమాకి మంచి బజ్ తీసుకొచ్చింది.
కానీ దర్శకుడు రాధాకృష్ణ రెడ్డి కథనం వీక్ గా ఉండటం వల్ల ఓ సాదా సీదా సినిమాగా మిగిలిపోయింది.ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
| నైజాం | 1.10 cr |
| సీడెడ్ | 0.28 cr |
| ఆంధ్ర | 1.37 cr |
| ఏపీ+తెలంగాణ | 2.75 cr |
| కర్ణాటక | 1.16 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ | 0.58 cr |
| వరల్డ్ వైడ్ (టోటల్) | 4.49 cr |
‘జూనియర్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కొరకు రూ.8.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా కేవలం రూ.4.49 కోట్ల షేర్ ను రాబట్టింది. మొత్తంగా బయ్యర్స్ కి రూ.4.01 కోట్ల నష్టాలు మిగిల్చి ప్లాప్ గా మిగిలింది.