అల్లు అర్జున్ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘దేశముదురు’ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమైన హన్సిక.. ఆ తరువాత ‘మస్కా’ ‘బిల్లా’ ‘కందిరీగ’ ‘దేనికైనా రెడీ’ వంటి హిట్ సినిమాల్లో నటించింది. కానీ తెలుగులో ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ గా మాత్రం ఎదగలేకపోయింది. అయితే తమిళ ప్రేక్షకులు మాత్రం ఈమెను నెత్తి పై పెట్టుకున్నారు.ఏకంగా గుడే కట్టించడానికి రెడీ అయిపోయారు. ఇదిలా ఉండగా.. అప్పట్లో ఈమె తమిళ హీరో శింబుతో ప్రేమాయణం కూడా నడిపింది.
కానీ మనస్పర్థలు రావడంతో బ్రేకప్ చేప్పేసింది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈమెకు పెద్దగా సినిమా అవకాశాలు లేకపోయినా.. నిత్యం వార్తల్లో మాత్రం నిలుస్తూనే ఉంటుంది. తాజాగా ఈమె మరోసారి వార్తల్లో నిలిచింది. విషయం ఏమిటంటే.. ‘హన్సిక ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతుందని’ ఓ వెబ్‌సైట్ ట్వీట్ వేసింది. ఆ ట్వీట్ చూసిన హన్సిక ఆశ్చర్యానికి గురయ్యింది. ‘పుకార్ల దేవుడా.. ఇంతకీ వరుడు ఎవరు?’ అంటూ ఆ ట్వీట్ కు హన్సిక రిప్లై ఇచ్చింది.
ఇక ఈ ట్వీట్ ను చూసిన హన్సిక స్నేహితుడు ‘ఓ మై గాడ్.. ఇప్పటివరకూ ఈ విషయాన్ని నాకెందుకు చెప్పలేదు?’ అంటూ కామెంట్ పెట్టాడు . దానికి హన్సిక ‘నాక్కూడా ఇప్పుడే తెలిసింది. అందుకే చెప్పలేకపోయాను’ అంటూ రిప్లై ఇచ్చింది.
Most Recommended Video
మేకప్ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్ వందాల్’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!