Happy Journey: ‘అమెజాన్ ప్రైమ్‌’లో ట్రెండింగ్లో దూసుకుపోతున్న ‘హ్యాపీ జర్నీ’

ఓటీటీ వేదికపై వినూత్న కథాంశాలతో తెరకెక్కిన సినిమాలకు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడుతుంటారు. తాజాగా ఇదే కోవలో ‘హ్యాపీ జర్నీ’(Happy Journey) చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్‌లో నిలిచి సంచలనం సృష్టిస్తోంది. ‘కొన్ని ప్రయాణాలు ప్రణాళికలను మారుస్తాయి.. మరికొన్ని జీవితాలనే మార్చేస్తాయి’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ చిత్రం, డిజిటల్ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. కేవలం వ్యూస్ పరంగానే కాకుండా, రేటింగ్స్ విషయంలోనూ ‘హ్యాపీ జర్నీ’ తన సత్తా చాటుతోంది.

Happy Journey

ప్రముఖ రేటింగ్ ప్లాట్‌ఫామ్ ఐఎండీబీలో ఈ సినిమా ఏకంగా 9.7/10 రేటింగ్ సాధించి ఔరా అనిపించింది. మరోవైపు బుక్ మై షో లోనూ 9.5/10 రేటింగ్‌తో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. ఆద్యంతం ఆకట్టుకునే కథనం, సహజమైన నటన ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. గుట్ట ప్రొడక్షన్స్, కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లపై బాలాజీ గుట్ట, కౌశిక్ రెడ్డి, అభిరామ్ నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు. తరుణ్ రెడ్డి, శైలేంద్ర కుమార్, రాజేష్ వ్రజ్‌లాల్ వసాని, సలోని జయ్ వసాని, అవిషా గోస్వామి తదితరులు కీలక పాత్రల్లో మెరిశారు.

సాంకేతిక నిపుణుల పనితీరు కూడా ఈ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించింది. శేఖర్ చంద్ర సంగీతం, మణికందన్ సుబ్రమణియన్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్షన్ చిత్రానికి మరింత వన్నె తెచ్చాయి. అనిల్ అండ్ భాను, వంశీ శేఖర్ ఈ చిత్రానికి పబ్లిసిటీ బాధ్యతలు నిర్వర్తించగా, జీ మ్యూజిక్ కంపెనీ ద్వారా పాటలు విడుదలయ్యాయి.కుటుంబ సమేతంగా చూడదగ్గ ఒక మంచి ఫీల్-గుడ్ ఎంటర్‌టైనర్‌గా ‘హ్యాపీ జర్నీ’ ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో సందడి చేస్తోంది.

ధనుష్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus