Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చారిత్రాత్మక చిత్రం ‘హరిహర వీరమల్లు’(Hari Hara Veeramallu). క్రిష్ దర్శకత్వంలో కొంత భాగం షూటింగ్ జరుపుకున్న తర్వాత కొన్ని కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది.

Hari Hara Veeramallu Collections

అయినప్పటికీ నిర్మాత ఏ.ఎం.రత్నం చాలా కష్టాలు పడి ఈ సినిమాని కంప్లీట్ చేశారు. 2025 జూన్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా.ప్రీమియర్ షోలతోనే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా. వి.ఎఫ్.ఎక్స్ వర్క్ విషయంలో చాలా విమర్శలు వెల్లువెత్తాయి. తర్వాత మరో వెర్షన్ ను వదిలారు. అయినా లాభం లేకపోయింది. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది.

ఓపెనింగ్స్ పరంగా పర్వాలేదు అనిపించినా.. తర్వాత బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 17.57 cr
సీడెడ్ 8.20 cr
ఉత్తరాంధ్ర 7.02 cr
ఈస్ట్ 4.84 cr
వెస్ట్ 4.13 cr
గుంటూరు 4.72 cr
కృష్ణా 4.28 cr
నెల్లూరు 1.85 cr
ఏపీ+తెలంగాణ 52.61 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 4.93 cr
ఓవర్సీస్ 6.47 cr
వరల్డ్ టోటల్ 64.01 cr (షేర్)

‘హరిహర వీరమల్లు’ చిత్రానికి రూ.120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.121 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్ ను ముగిసేసరికి ఈ సినిమా రూ.64.01 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.105.22 కోట్లు కలెక్ట్ చేసింది. మొత్తంగా బయ్యర్స్ కి రూ.56.99 కోట్ల భారీ నష్టాలు మిగిల్చి డిజాస్టర్ లిస్టులో చేరింది.

ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus