Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

‘మహావతార్ నరసింహ’ చిత్రం జూలై 25న చాలా సైలెంట్ గా రిలీజ్ అయ్యింది. పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ వంటి పెద్ద సినిమా ఉండటంతో మొదట తెలుగు ప్రేక్షకులు దీనిని పట్టించుకోలేదు.

Mahavatar Narsimha Collections

అయినప్పటికీ లిమిటెడ్ స్క్రీన్స్, తక్కువ టికెట్ రేట్లతో అందుబాటులోకి వచ్చింది. మొదటి రోజు పాజిటివ్ టాక్ రావడంతో షో షోకి స్క్రీన్స్ పెరిగాయి. దర్శకుడు అశ్విన్ కుమార్ మహావిష్ణువు 9 అవతారాలను యానిమేటెడ్ వెర్షన్లుగా..  9 సినిమాలుగా తీస్తానని వెల్లడించిన ప్రకారంగా…. మొదట ‘మహావతార్ నరసింహ’ ని రంగంలోకి దింపారు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకుంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ ని రాబట్టింది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ను గమనిస్తే :

ఏపీ+తెలంగాణ 22.98 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా+హిందీ 115.2 cr
ఓవర్సీస్ 6.60 cr
వరల్డ్ టోటల్ 144.75 cr (షేర్)

‘మహావతార్ నరసింహ’ ప్రపంచ వ్యాప్తంగా రూ.15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి వరల్డ్ వైడ్ గా ఎవ్వరూ ఊహించని విధంగా ఏకంగా రూ.144.75 కోట్ల షేర్ ను రాబట్టింది. రూ.129.75 కోట్ల లాభాలతో అంటే.. దగ్గర దగ్గరలో 10 రెట్లు లాభాలు అందించింది అని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో కూడా రూ.22.98 కోట్ల షేర్ ను రాబట్టడం అంటే చిన్న విషయం కాదు. అది కూడా పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో సినిమా ఉండగా..భారీ వర్షాలు పడుతున్నప్పుడు కూడా ఈ రేంజ్లో వసూల్ చేయడం గమనార్హం.

అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus