Hari Teja: ‘బిగ్ బాస్’ బ్యూటీ హరితేజ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

Advertisement

ఓ వైపు వరుస సినిమాల్లో నటిస్తూనే మరో పక్క బుల్లితెర పై కూడా బిజీ యాంకర్ గా రాణిస్తుంది హరితేజ..! బిగ్ బాస్ 1 రియాలిటీ షోలో పాల్గొని విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న ఈ బ్యూటీ .. దానిని కాపాడుకోవడానికి చాలా కష్టపడుతుంది. బిగ్ బాస్ లో ఈమె అమాయకత్వం ప్రేక్షకులకు బాగా నచ్చింది.ఈమె విన్నర్ కావాలని చాలా మంది కోరుకున్నారు.కానీ అలా జరగలేదు. ఇదిలా ఉండగా.. హరితేజ ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుండీ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది హరితేజ.

కరోనా కారణంగా చాలా జాగ్రత్తలు వహించాలని ఈమెకు డాక్టర్లు సూచించారట. అయితే తన బేబీ బంప్ ఫోటో షూట్ తో మాత్రం బాగానే సందడి చేసింది. ఇక ఏప్రిల్ 5న హరితేజ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఇదిలా ఉండగా.. ఈరోజు హరితేజ పెళ్లి రోజు. దాంతో ఓ ఎమోషనల్ పోస్ట్ ను పెట్టింది. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో హరితేజ తన కూతురి ఫోటోని షేర్ చేసింది.అయితే పాప మొహం మాత్రం ఇందులో కనిపించడం లేదు..!

ఇక పాపను హరితేజ భర్త దీపక్ ఎత్తుకుని ముద్దాడుతున్నట్టు ఇందులో కనిపిస్తుంది. ‘మన పెళ్లిరోజుని మరింత స్పెషల్ గా , గుర్తుండిపోయేలా మార్చేసావు.. పెళ్లిరోజు శుభాకాంక్షలు దీపు’.. అంటూ ఎమోషనల్ కామెంట్ పెట్టింది హరితేజ. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది. హరితేజ, దీపక్ లు 2015 లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.


Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news