HariHara Veeramallu: ‘హరిహర వీరమల్లు’ కి అరుదైన గౌరవం.. ఏకంగా ఢిల్లీ ఏపీ భవన్ లో..!

అవును పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి అరుదైన గౌరవం లభించింది.విషయంలోకి వెళితే.. మన దేశ రాజధాని ఢిల్లీలో ‘హరిహర వీరమల్లు’ చిత్రాన్ని 2 రోజుల పాటు ఏపీ భవన్ లో ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారట. వీకెండ్ కాబట్టి శని, ఆదివారాల్లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆడిటోరియంలో 2 షోలు ప్రత్యేకంగా వేస్తున్నారని తెలుస్తుంది. ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ శ్రీ లవ్ అగర్వాల్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

HariHara Veeramallu

కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తూ ఢిల్లీలో స్థిరపడిన తెలుగు ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన చిత్రాన్ని ప్రదర్శిస్తున్నట్లు స్పష్టమవుతుంది. జూలై 26న అంటే శనివారం రాత్రి 7 గంటలకు, అలాగే జూలై 27న అంటే ఆదివారం నాడు సాయంత్రం 4 గంటలకు ‘హరిహర వీరమల్లు’ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు.

ఇక జూలై 24న రిలీజ్ అయిన ‘హరిహర వీరమల్లు’ సినిమాకి జూలై 23 నైట్ ప్రీమియర్స్ వేశారు. వాటి నుండి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే సినిమాలో బలమైన ఎమోషన్ ఉంది. 16వ శతాబ్దంలో హిందువులను మొగల్ సామ్రాజ్యానికి చెందిన రాజులు ఎలా అణగదొక్కే వారు, ఎలా చిత్ర హింసలు పెట్టేవారు అనేది చూపించారు. ధర్మం కోసం నిలబడిన యోధుడు ‘హరిహర వీరమల్లు’ పాత్రలో పవన్ కళ్యాణ్ తన బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. పవన్ కు ఇప్పుడున్న పొలిటికల్ ఇమేజ్ కి కరెక్ట్ గా సూట్ అయ్యే కథ ఇది.

36 ఏళ్ల విజయ్‌ పెళ్లి గురించి ఇన్‌డైరెక్ట్‌ హింట్‌ ఇచ్చాడా? ఆ మాటకు అర్థమదేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus