విజయ్ దేవరకొండ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాడు. ‘కింగ్డమ్’ సినిమా విడుదల తేదీలు వరుసగా మారుతూ ఉండటంతో పెద్దగా బయటకు రాలేదు. ఇప్పుడు సినిమా రిలీజ్‌కు మరో ఐదు రోజులు ఉండటంతో ఇంటర్వ్యూలు ఇవ్వడం ప్రారంభించాడు. ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ఓ ఇంటర్వ్యూ ఇచ్చాక.. మరో ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. అందులో అతని మాటలు చూస్తుంటే విజయ్‌కి పెళ్లి మీద ఏమన్నా మనసైందేమో అనిపిస్తోంది. దానికి కారణ గర్ల్‌ఫ్రెండ్ టాపిక్‌ను బయటకు తీసుకురావడమే.
మానవ సంబంధాలు ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యమైనవని నా అభిప్రాయం. గత రెండేళ్లలో వాటి విలువ ఇంకా బాగా తెలిసొచ్చింది. రెండు, మూడేళ్లుగా నేను జీవించిన విధానం నాకే నచ్చలేదు. కుటుంబంతో కలసి టైమ్ స్పెండ్ చేయలేదు. అమ్మానాన్న, స్నేహితులు, గర్ల్‌ఫ్రెండ్ ఎవరికీ సమయాన్ని కేటాయించలేదు అని చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ. అంతేకాదు ఈ విషయాన్ని తనకు తానే గ్రహించాను అని చెప్పాడు విజయ్. ఆ రోజ నుండి పద్ధతి మార్చుకున్నాను అని చెప్పాడు.
ఇప్పుడు నా వాళ్ల కోసం సమయాన్ని వెచ్చిస్తున్నాను అని కూడా చెప్పాడు. తనవారితో కలిసి విలువైన సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్పాడు. ఫ్యామిలీతో అని చెప్పి ఉంటే సరిపోయేది. కానీ మధ్యలో గర్ల్ ఫ్రెండ్ ప్రస్తావన రావడంతో విజయ్‌కి పెళ్లి మీద మనసైందా అనే చర్చ మొదైంది. విజయ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు అనేది అందరికీ తెలిసిందే. కాబట్టి ఆమెతోనే విజయ్ పెళ్లా అనేదే చర్చ.
అయితే ఇటు విజయ్, అటు ఆయన రూమర్డ్ లవర్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కాబట్టి ఇప్పట్లో పెళ్లి అని చెప్పలేం. మరి గర్ల్‌ఫ్రెండ్‌తో సమయం గడపాలని ఉంది అని అన్నాడు అంటే.. మళ్లీ ఏమన్నా ఫారిన్ ట్రిప్స్ వేస్తాడేమో చూడాలి. గతంలో సినిమాల విడుదల తర్వాత ఇలా ట్రిప్స్‌కి వెళ్లారు మరి.