Harish Shankar: బాడీ డబుల్‌ రూమర్లు.. ఎంజాయ్‌ చేశానంటున్న హరీశ్‌ శంకర్‌.. ఏమైందంటే?

‘గబ్బర్‌ సింగ్‌’ సినిమాలో ఓ సీన్‌లో పవన్‌ కల్యాణ్‌కి డూప్‌గా హరీశ్‌ శంకర్‌ నటించారు. పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌కి ఈ విషయం తెలిసే ఉంటుంది. ‘కెవ్వు కేక..’ పాటకు ముందు చీకట్లో ఓ టోల్‌ గేట్‌ ముందు విలన్లకు ఎదురుగా చీకట్లో పవన్‌ కల్యాణ్‌ ఉంటాడు. అయితే అది పవన్‌ కాదు.. హరీశ్‌. ఈ విషయాన్ని ఆయనే గతంలో చాలాసార్లు చెప్పారు. అయితే ఇప్పుడు ఈ కాంబినేషన్‌లో ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ అనే సినిమా వస్తోంది. మరి ఇందులోనూ హరీశ్‌ బాడీ డబుల్‌లా కనిపిస్తారా?

Harish Shankar

ఇదేం ప్రశ్న.. ఆయన వింటే బాధపడతారు అనుకుంటున్నారా? వింటే బాధపడటం ఏంటి? ఆయన విన్నారు ఆ మాటకు సంతోషించారు కూడా. నిజానికి ఈ పుకారు వచ్చింది సినిమా ప్రీలుక్‌ పోస్టర్‌ విడుదలైనప్పుడే. ఆ పోస్టర్‌లో పవన్‌ కల్యాణ్‌ను వెనుకవైపు నుండి ఫొటో తీశారు. దీంతో ఆ ఫొటోలో ఉన్నది పవన్‌ కాదని, హరీశ్‌ శంకర్‌ అని కామెంట్లు వచ్చాయి. హరీశ్ శంకరే స్వయంగా డూప్‌గా నటించారని కూడా కొంతమంది అన్నారు. అంతెందుకు టీజర్ విడుదలైన తర్వాత కూడా కొందరు డూప్‌ కామెంట్లు చేశారు.

ఈ కామెంట్లపై హరీశ్‌ శంకర్‌ తాజాగా మాట్లాడుతూ తాను పవన్ కల్యాణ్‌కు ఎప్పుడూ డూప్‌గా నటించలేదని క్లారిటీ ఇచ్చారు. ఆ రూమర్లు చూసి బాధ పడలేదని, పవన్‌తో తనను పోల్చడం, తాను ఒక స్టార్ హీరోలా కనిపిస్తున్నానని జనం అనుకోవడం సంతోషాన్నిచ్చిందని సరదాగా అన్నారు హరీశ్‌. అలాగే సినిమాల్లో బాడీ డూప్‌ను ఎందుకు ఉపయోగిస్తారనే విషయంపై కూడా హరీశ్ శంకర్ వివరణ ఇచ్చారు.

సినిమా షూటింగ్ సమయంలో హీరోలకు చిన్న గాయం తగిలినా షూటింగ్ షెడ్యూల్స్ అస్తవ్యస్తమవుతాయి. దీని వల్ల నిర్మాతలకు రూ.కోట్ల నష్టం వస్తుంది. అందుకే హీరోల భద్రతను దృష్టిలోఉంచుకుని, రిస్క్ ఎక్కువగా ఉండే సన్నివేశాల్లో డూప్స్‌ను వాడతారని వివరించారు. అయితే రిస్క్‌ లేకపోయినా కొంతమంది హీరోలకు డూప్‌లు వాడి రీసెంట్‌గా కొన్ని సినిమాలు తీవ్ర విమర్శపాలైన విషయం తెలిసిందే.

వైరల్‌ రాజశేఖర్‌ గోటీల ఫ్యాక్టరీ.. జీవిత ఏమన్నారంటే?

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus