Jeevitha Rajasekhar: వైరల్‌ రాజశేఖర్‌ గోటీల ఫ్యాక్టరీ.. జీవిత ఏమన్నారంటే?

Advertisement

కొన్ని మీమ్స్‌ ఎలా, ఎప్పుడు, ఎందుకు వస్తాయో.. ఎవరు పుట్టిస్తారో తెలియదు కానీ తరచూ కనిపించి నవ్విస్తుంటాయి. అలాంటి వాటిలో రాజశేఖర్‌ గోటీల ఫ్యాక్టరీ ఒకటి. ప్రముఖ నటుడు రాజశేఖర్‌కి ఓ గోటీల ఫ్యాక్టరీ ఉందని.. గత కొన్ని నెలలుగా సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతూనే ఉంది. తొలుత మీమ్స్‌ రాగా.. ఆ తర్వాత మేము రాజశేఖర్‌ గోటీల ఫ్యాక్టరీ ఉద్యోగులం అంటూ కొన్ని వీడియోలు వైరల్‌ అయ్యాయి. తాజాగా ఈ వ్యవహారంపై రాజశేఖర్ భార్య నటి, దర్శకులు జీవిత రియాక్ట్ అయ్యారు.

Jeevitha Rajasekhar

గోటీల ఫ్యాక్టరీ ఏంటో, ఎవరు, ఎందుకు వైరల్ చేశారో తెలియదని చెప్పిన జీవిత.. రాజశేఖర్‌, తాను, పిల్లలు ఆ మీమ్స్‌, వీడియోలు చూసి నవ్వుకున్నామని చెప్పారు. అయితే కొందరు ఆ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పోస్టులు చేస్తున్నారని విన్నానని, ఇలాంటి రీల్స్, ఫేక్ న్యూస్ ఎవరూ నమ్మొద్దని ఆమె కోరారు. దీంతో కొంతమంది నెటిజన్లు ‘ఇది నిజం కాదా.. మేమింకా నిజం అనుకున్నాం’ అని కామెంట్లు చేస్తున్నారు. రాజశేఖర్‌కి ఓ గోళీల ఫ్యాక్టరీ ఉందని, దాని ద్వారా రూ.కోట్లలో ఆదాయం వస్తోంది అనేది ఇన్నాళ్లుగా సాగుతున్న ప్రచారం.

అంతేకాదు ఆ ఫ్యాక్టరీలో పని చేసే వారికి రూ.లక్షల్లో జీతాలు ఉంటాయని అంటూ కొంతమంది నెటిజన్లు ఇంటర్వ్యూలు, ఐడీ కార్డులు రెడీ చేశారు. అయితే ఇదంతా ఫేకే అని అని ఇప్పుడు తేలింది. దీంతో ఇకనైనా ఈ గోటీల ఫ్యాక్టరీ గోల ఆగుతుందేమో చూడాలి. ఇక రాజశేఖర్‌ సినిమాల సంగతి చూస్తే.. శర్వానంద్‌ ‘బైకర్‌’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా త్వరలో విడుదల అవుతుంది. ఇది కాకుండా ‘లబ్బర్‌ పందు’ సినిమా రీమేక్‌ ఇటీవల మొదలైంది. అయితే ఈ సినిమా షూటింగ్‌లో గాయపడటంతో ప్రస్తుతం ఆయన రెస్ట్‌లో ఉన్నారు. కోలుకున్నాక తిరిగి సినిమా స్టార్ట్‌ చేస్తారు.

తెలిసి తెలిసీ ‘పద్మ’ అవార్డు ఇచ్చారు.. ఇప్పుడు చూడండి ఏమైందో?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news