Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

నిన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండి 3వ పాటకి సంబంధించిన ప్రోమో విడుదలైంది. సోషల్ మీడియాలో దాని హవా కొనసాగింది. ఈ క్రమంలో ఓ పవన్ కళ్యాణ్ అభిమాని ‘BoB రికార్డులు లేచిపోవాలి’ అంటూ కామెంట్ చేశాడు.మహేష్ బాబుని BoB(Boss Of Boxoffice) అంటూ అభిమానులు పిలుచుకుంటారు అనేది గమనించాలి. ఇక ఆ ఫ్యాన్ పోస్ట్ ని దర్శకుడు హరీష్ శంకర్(Harish Shankar) కోట్ చేస్తూ ‘తధాస్తు’ అని కామెంట్ కూడా పెట్టాడు.

Harish Shankar

కాసేపటికి దానిని డిలీట్ చేశాడు. అయితే ఈ గ్యాప్లోనే చేయాల్సిన రచ్చ అంతా మహేష్ బాబు అభిమానులు చేసేశారు. హరీష్ కోట్ చేసిన ట్వీట్ ని స్క్రీన్ షాట్లుగా తీసుకుని ‘హరీష్ కి ఎక్కువైంది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్ ని బ్యాన్ చేయాలి’ అంటూ నెగిటివ్ కామెంట్లతో రెచ్చిపోయారు. దీంతో హరీష్ శంకర్ రంగంలోకి దిగి మహేష్ అభిమానులకి క్షమాపనలు తెలుపుతూ ఓ లెటర్ పోస్ట్ చేశారు.

ఈ వివాదం పై హరీష్ శంకర్ స్పందించారు. నిన్న నేను చాలా బిజీ. సెన్సార్ అనంతరం బోర్డు అధికారులతో సమావేశం, ఆశీర్వాదం కోసం పెద్దమ్మ తల్లి గుడి సందర్శన, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, అలాగే పాట ప్రోమో ఫైనల్ చెక్ వ్యవహారం… ఇలా వీటితోనే టైమ్ అంతా అయిపోయింది. ప్రమోషన్స్ ముగించుకుని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం తమన్ స్టూడియోకు వెళ్లాను. ఆ టైమ్లో ప్రోమోపై ప్రశంసలు కురిపిస్తున్న జర్నలిస్టులకు, స్నేహితులకు, అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ మళ్ళీ అదో హడావిడి.

ఈ క్రమంలో ఒక ట్వీట్‌ను పూర్తిగా చదవకుండానే పొరపాటున కోట్ చేశాను. తర్వాత నా టీమ్ దాని గురించి క్లారిటీ ఇచ్చింది. నా పొరపాటుని గ్రహించి వెంటనే నేను డిలీట్ చేశాను.సూపర్ స్టార్ మహేష్ బాబు గారిపై నాకు అపారమైన గౌరవం ఉంది. ‘వారణాసి’ సినిమాతో ఆయన మరిన్ని రికార్డులు సృష్టించాలని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తిని నేను. ఆయన్ని గానీ, ఆయన అభిమానులను గానీ కించపరచాలనే ఉద్దేశం నాకు ఏ రోజూ లేదు.

గతంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘పోకిరి’ గురించి నేను చేసిన ట్వీట్లు చూస్తే ఆయనపై నాకు ఉన్న గౌరవం మీరు అర్దం చేసుకోవచ్చు. ఇప్పుడు ఓ క్షణంలో జరిగిన చిన్న పొరపాటు వల్ల ఎవరికైనా మనస్తాపం కలిగి ఉంటే హృదయపూర్వక క్షమాపణలు కోరుతున్నాను. దయచేసి క్షమించండి. ఒక సినిమా రికార్డులు సృష్టించాలంటే అందరు హీరోల అభిమానుల మద్దతు అవసరమని నమ్మేవాడిని.

నా సినిమా విడుదలకు మరో 10 రోజులు మాత్రమే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కావాలని వివాదాస్పద పోస్టులు చేసేంత అవగాహన లేనివాడిని కాదు. కాబట్టి.. అనుకోకుండా ఓ పోస్టు వల్ల జరిగిన  పొరపాటును క్షమించి, మా సినిమాకు మీ మద్దతును కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. నా పరిస్థితిని అర్థం చేసుకుంటారని ఆశిస్తూ.. మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.” అంటూ పేర్కొన్నాడు.

‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus