Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

హరీష్ శంకర్(Harish Shankar).. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకడు. ‘గబ్బర్ సింగ్’ వంటి ఆల్ టైమ్ రికార్డులు సృష్టించిన సినిమానే కాకుండా ‘మిరపకాయ్’ ‘గద్దలకొండ గణేష్’ ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ వంటి సూపర్ హిట్లు కూడా ఇతని ఖాతాలో ఉన్నాయి.

Harish Shankar

హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా వస్తుందంటే అటు ఇండస్ట్రీ వర్గాల్లో ఇటు ట్రేడ్ సర్కిల్స్ లో భారీ అంచనాలు ఏర్పడతాయి. మాస్ ఆడియన్స్ లోనే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా హరీష్ శంకర్ సినిమాలకి మంచి క్రేజ్ ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఈ మధ్యనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు హరీష్ శంకర్. ఈ సినిమాలో చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ ను వింటేజ్ లుక్ లో ప్రెజెంట్ చేసి అభిమానులని ఆకట్టుకున్నాడు. అయితే హరీష్ నెక్స్ట్ మూవీ ఏ హీరోతో చేయబోతున్నాడు? ఏ బ్యానర్లో చేయబోతున్నాడు అనే ఆసక్తి ఇప్పుడు సర్వత్రా ఏర్పడింది. ఈ క్రమంలో హరీష్ శంకర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకి వచ్చింది.

ఆ వార్త ప్రకారం హరీష్ శంకర్ తన నెక్స్ట్ సినిమాని శ్రీనివాస్ చిట్టూరి నిర్మాణంలో ‘శ్రీనివాస సిల్వర్ స్క్రీన్’ సంస్థలో చేయబోతున్నారని తెలుస్తోంది. శ్రీనివాస్ చిట్టూరి ‘నా సామి రంగ’ వంటి హిట్ సినిమాలు అందించిన సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఆయన ఓ క్రేజీ ప్రాజెక్టుని సెట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే హీరో ఎవరు అనేది తెలియాల్సి ఉంది.

యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus