Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

టాలీవుడ్‌లో(Tollywood) పారితోషికాల వ్యవహారాలు నిత్యం హాట్ టాపిక్ అవుతుంటాయి. అయితే ఎక్కువ శాతం హీరో, హీరోయిన్లు లేదా స్టార్ డైరెక్టర్ల పారితోషికాల గురించే మాట్లాడుకుంటాం.

Tollywood

పలానా హీరో అంత తీసుకున్నాడు,పలానా హీరోయిన్ ఇంత తీసుకుంది లేదంటే పలానా దర్శకుడు ఇంత డిమాండ్ చేస్తున్నాడు అంటూ అక్కడి వరకే మాట్లాడుకుంటాం. కానీ మిగిలిన నటీనటుల పారితోషికాల గురించి పెద్దగా మాట్లాడుకోము.

అయితే ఈ మధ్య కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పారితోషికాల గురించి కూడా ఇండస్ట్రీలో ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. సినిమాలో కీలక పాత్రలు పోషించే కొంతమంది నటీనటులకు నిర్మాతలు పారితోషికాలు ఎగ్గొడుతున్నారు అనేది ఆ చర్చల సారాంశం. ఇందులో బడా నిర్మాణ సంస్థలు కూడా ఉండటం షాకిచ్చే అంశం. ప్రస్తుతం టాలీవుడ్లో పారితోషికాలు కరెక్ట్ గా ఇచ్చే నిర్మాణ సంస్థలు రెండే రెండట. ఈ రెండు నిర్మాణ సంస్థల్లో ఓ నిర్మాణ సంస్థ కూడా నటీనటుల పారితోషికాలు పెండింగ్లో పెట్టడం మొదలుపెట్టిందట.

విషయంలోకి వెళితే.. ఆ బడా నిర్మాణ సంస్థ, ఓ యువ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌కు ఇవ్వాల్సిన రూ. 7 లక్షల పారితోషికాన్ని ఎగ్గొట్టినట్లు ఇన్సైడ్ టాక్ గట్టిగా వినిపిస్తోంది. సంక్రాంతికి వచ్చిన ఓ సినిమాలో ఇతను హీరో ఫ్రెండ్ పాత్ర పోషించాడు. ఆ సినిమా కూడా బాగా ఆడింది. సినిమాలో ఈ యువ క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసింది కూడా ఎక్కువ నిడివి కలిగిన పాత్రే. అయినప్పటికీ అతనికి చెల్లించాల్సిన రూ.7 లక్షల పారితోషికాన్ని ఇంకా చెల్లించలేదట సదరు నిర్మాణ సంస్థ.

చిన్న చితకా ప్రొడక్షన్ హౌస్‌లు బడ్జెట్ ఇబ్బందుల వల్ల ఇలా పారితోషికాలు ఎగ్గొట్టడం చూస్తుంటాం. కానీ, టాలీవుడ్‌లో ఎంతో పేరున్న, ఇప్పటివరకు ఎటువంటి మచ్చ లేని ఆ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ కూడా ఇలాంటి మార్గాన్ని ఎంచుకోవడం బాధకారమే..!

‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus