Harish Shankar: ‘గ్లాస్‌’ డైలాగ్‌పై హరీశ్‌ శంకర్‌ రియాక్షన్‌… మరోసారి థ్యాంక్స్‌ చెబుతూ..!

  • April 2, 2024 / 06:28 PM IST

సినిమా డైలాగ్‌కు పొలిటికల్‌ టచ్‌ ఉండాలి… కానీ అది పొలిటికల్‌ డైలాగ్‌ అవ్వకూడదు. ఇలాంటి లాజిక్‌తో డైలాగ్‌ రాయాలంటే, రాసి మెప్పించాలంటే ప్రజెంట్ పర్‌ఫెక్ట్‌గా సరిఓయే ఉదాహరణ ‘భగత్స్‌ బ్లేజ్‌’. అవును ఆ వీడియోలో పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) చెప్పిన గ్లాస్‌ డైలాగ్‌కి భలే రెస్పాన్స్‌ వచ్చింది. ఆ డైలాగ్‌ను రాసిన ప్రముఖ దర్శకుడు హరీశ్‌ శంకర్‌ను (Harish Shankar) పవన్‌ ఫ్యాన్స్‌, జనసేన కార్యకర్తలు తెగ మెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఈ డైలాగ్‌ పవన్‌ స్పందించగా… ఇప్పుడు హరీశ్‌ శంకర్‌ స్పందించారు.

హరీశ్ శంకర్‌ దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న సినిమా ‘ఉస్తాద్ భగత్‌ సింగ్‌’(Ustaad Bhagat Singh). ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌, గ్లింప్స్‌ సినిమాపై అంచనాలను పెంచగా.. ఈ మధ్య విడుదల చేసి బ్లేజ్‌ వీడియో ఇంకా అదిరిపోయింది. ‘గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది’, ‘గ్లాస్‌ అంటే సైజు కాదు, సైన్యం.. కనిపించని సైన్యం’ అంటూ పవన్‌ చెప్పిన డైలాగ్స్‌ అదిరిపోయాయి. ఆ డైలాగ్‌లపై పవన్‌ ఓ మీటింగ్‌లో మాట్లాడుతూ… సినిమాలో అలాంటి డైలాగులు ఎందుకని హరీశ్‌ను అడిగాను. ‘మీకు తెలియదు.. మా బాధలు మాకున్నాయి.

ఇలాంటి డైలాగులు రాయకపోతే అభిమానులు ఊరుకోరు’ అని అన్నారు’ అంటూ మాట్లాడారు. ఆ వీడియోను తాజాగా హరీశ్‌ శంకర్‌ షేర్‌ చేస్తూ… ‘‘మీ ప్రేమకు ధన్యవాదాలు సర్కార్‌. మీరు అంగీకరించాలే కానీ, ఇలాంటివి ఇంకా చాలా రాస్తా’’ అని అన్నారు. దీంతో ఈ మాటలు వైరల్‌గా మారాయి. ‘గబ్బర్‌సింగ్‌’ తర్వాత పవన్‌ కల్యాణ్‌ – హరీశ్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది. ఆ సినిమా రీమేక్‌ కావడం, ఈ సినిమా కూడా రీమేక్‌ కావడం…

రెండింట్లో పవన్‌ పోలీసుగా ఉండటం లాంటి కారణాల వల్ల ఫ్యాన్స్‌ భారీ ఆశలే పెట్టుకున్నారు. పవన్‌ సరసన శ్రీలీల (Sreeleela)  నటిస్తున్న ఈ సినిమాను గతేడాది డిసెంబర్‌లో విడుదల చేయాలని అనుకున్నారు. అయితే పవన్‌ రాజకీయ కార్యక్రమాల వల్ల అప్పుడు షూటింగ్‌ పూర్తవ్వలేదు. అయితే ఇప్పుడు ఎన్నికల తర్వాత పవన్‌ ఫుల్‌ ప్లడ్జ్‌ డేట్స్‌ ఇచ్చి సినిమాను పూర్తి చేయాలని అనుకుంటున్నారట.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus