‘వరల్డ్ ఫేమస్ లవర్’ : సెన్సార్ కు బలైన సన్నివేశాలు..!

  • February 10, 2020 / 07:05 PM IST

విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. రాశీ ఖన్నా, కెథరిన్, ఐశ్వర్య రాజేష్, ఇజాబెల్లా వంటి క్రేజీ భామలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘మళ్ళీ మళ్ళీ ఇదిరాని రోజు’ ఫేమ్ క్రాంతి మాధవ్ ఈ చిత్రానికి దర్శకుడు. ‘క్రియేటివ్ కమర్షియల్స్’ బ్యానర్ పై కె.ఎస్.రామారావు, కె.ఏ. వల్లభ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 14న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్ ను ఇటీవల విడుదల చేయగా మంచి స్పందన లభించింది.

ఇక ఈరోజు ఈ చిత్రానికి సంబందించిన సెన్సార్ పనులు కూడా పూర్తయ్యాయి. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వారు యూ/ఏ సర్టిఫికెట్ ను జారీ చేశారు. ఇక ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలకు సెన్సార్ బోర్డు వారు అభ్యంతరాలు తెలిపినట్టు తెలుస్తుంది :

1) ఓ సన్నివేశంలో యామిని (హీరోయిన్ రాశీ ఖన్నా) ‘స్ప్రెడ్ మై లె**స్ అని అడిగే డైలాగును మ్యూట్ చేశారట.
2) అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో వచ్చే ఫ*** అనే అనే పదాన్ని కూడా మ్యూట్ చేసినట్టు సమాచారం.
3) ఇక పొగ త్రాగొద్దు, మద్యం సేవించవద్దు అనే వార్నింగ్ మెసేజ్ లు కూడా సైడ్ న వేసినట్టు తెలుస్తుంది.

ఇక ‘వరల్డ్ ఫేమస్’ లవర్ చిత్రానికి గోపిసుందర్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం ఏ స్థాయి విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి.

Most Recommended Video

జాను సినిమా రివ్యూ & రేటింగ్!
సవారి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus