అబ్బాయ్ కి బాబాయ్ అంటే ప్రేమే..ఇదే ప్రూఫ్..!

నందమూరి ఫ్యామిలీలో బాలయ్య తరువాత అంతటి స్టార్ డమ్ తెచ్చుకున్న హీరో ఒక్క ఎన్టీఆర్ మాత్రమే. ఆయన తాత పేరు పెట్టుకున్నందుకు ఆ వారసత్వాన్ని నిలబెట్టాడు. కాగా 2009 ఎన్నికలలో టీడీపీ తరుపున ఎన్టీఆర్ ప్రచారం చేశారు. ఆ ఎన్నికలలో టీడీపీకి విజయం దక్కలేదు. అదే ఏడాది ఎన్టీఆర్ కార్ ఆక్సిడెంట్ కి గురికావడం జరిగింది. కారణం ఏదైనా హరి కృష్ణ ఫ్యామిలీ చంద్రబాబు మరియు బాలయ్య ఫ్యామిలీకి దూరం అయ్యారు. అప్పటి నుండి వారి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది.

ఇక హరికృష్ణ మరణం తరువాత ఈ రెండు కుటుంబాలు కొంచెం దగ్గరయ్యాయి. ఐతే బాలయ్య చేసిన ఎన్టీఆర్ బయో పిక్ లో ఎన్టీఆర్ గా నటించడానికి జూనియర్ ఎన్టీఆర్ తిరస్కరించారు. అలాగే ఎన్టీఆర్ బయో పిక్ చేసే సత్తా ఎవరికీ లేదు, నాకు అసలు లేదు..ఎప్పటికీ చేయను అన్నారు. ఇక ఆ బయో పిక్స్ విడుదల తరువాత వాటిని సపోర్ట్ చేస్తూ ఓ ట్వీట్ చేసింది లేదు. ఒకటి రెండు సార్లు వేదికలపై కలిసి కనిపించినా వీరి మధ్య స్పర్ధలు తొలిగిపోయాయన్న భావన కలగలేదు.

Here is the proof to say Balayya Babu and NTR are not separated1

ఐతే నేడు ఎన్టీఆర్ రియల్ మెన్ ఛాలెంజ్ లో బాలయ్యను నామినేట్ చేశారు. సీనియర్ స్టార్ హీరోలైన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లతో పాటు బాలయ్యను కూడా నామినేట్ చేయడం జరిగింది. ఆ నామినేషన్ లో బాలయ్య బాబాయ్ ని నామినేట్ చేస్తున్నట్లు కొంచెం ఆప్యాయంగా చెప్పారు. దీనితో ఎన్టీఆర్ బాలయ్య మధ్య వివాదం కొనసాగుతుంది అని నమ్ముతున్నవారికి అది నిజం కాదని చెప్పినట్లైంది. ఇక బాలయ్య ఈ ఛాలెంజ్ స్వీకరించి పూర్తి చేస్తే పూర్తిగా వీరి అనుభందం పై క్లారిటీ వచ్చేస్తుంది.

Here is the proof to say Balayya Babu and NTR are not separated2

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus