అమ్మాయి కోసం తన్నులు తిన్న నాని!

సినిమాల్లో సహజంగా నటించడమే కాదు నిజజీవితంలో ఎలాంటి హంగులు ఆర్భాటాలకు పోకుండా మనలో ఒకడిగా వ్యవహరిస్తాడనే నానికి అందరూ ముద్దగా న్యాచురల్ స్టార్ అనే పేరు పెట్టారు. రీసెంట్ గా “మిడిల్ క్లాస్ అబ్బాయి”తో యావరేజ్ హిట్ అందుకొని తదుపరి చిత్రాలతో బిజీగా ఉన్న నాని రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హీరో అవ్వడానికి, సినిమా ఇండస్ట్రీకి రావడానికి ముందు తన జీవితంలో చోటు చేసుకొన్న ఓ సరదా సంభాషణను మీడియాతో పంచుకొన్నాడు. ఆ విషయం తెలిసినప్పట్నుంచి అందరూ “అయ్యో నాని” అంటున్నారు. జనాలు నాని మీద ఆస్థాయిలో జాలిపడేలా వచ్చిన ఆ న్యూస్ ఏంటో మీరూ చూడండి.

అవి నాని చదువుకొనే రోజులు, ఆ టైమ్ లో అమ్మాయిల మీద క్రష్ ఉండడం, అలా ఇష్టపడిన అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి రకరకాల ట్రైల్స్ వేయడం సర్వసాధారణం. అందుకు నాని మాత్రం మినహాయింపు ఎందుకవుతాడు చెప్పండి. అందుకే.. తనకు నచ్చిన ఒకమ్మాయిని ఎవరో అబ్బాయిలు ఏడిపించారని తెలిసేసరికి ఆమె ముందు బడాయికిపోయి.. ఆ ఏడిపించిన కుర్రాళ్ళని కొట్టడానికి ఎగేసుకుని వెళ్లాడట. కట్ చేస్తే.. వారి చేతిలో తన్నులు తిని దాదాపుగా ఏడ్చుకుంటూ ఇంటికి వెనుదిరిగాడట. ఈ విషయాన్ని చెప్పి నాని నవ్వేసినా.. నెటిజన్లు మాత్రం అయ్యో అంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus