‘బిగ్ బాస్’ సీజన్ 8 కి రంగం సిద్ధమైంది. ఈ సీజన్ ను కూడా నాగార్జునే (Nagarjuna) హోస్ట్ చేస్తున్నారు. కంటెస్టెంట్ల లిస్ట్ కూడా ఇదే అంటూ కొందరు సెలబ్రిటీల పేర్లు మొన్నామధ్య తెగ వైరల్ అయ్యాయి. ఆ లిస్ట్ లో.. రాజ్ తరుణ్ (Raj Tarun) , ప్రభాస్ శ్రీను (Prabhas Sreenu) ,గాయత్రి గుప్తా, యాంకర్ వింధ్య, ఆస్ట్రాలజర్ వేణు స్వామి,యాంకర్ నిఖిల్,యూట్యూబర్ బమ్ చిక్ బబ్లూ,డాన్సర్ శ్వేతా నాయుడు,నటి దీపిక,సీరియల్ నటుడు ఇంద్రనీల్, కమెడియన్ సద్దాం (Saddam) ,కమెడియన్ యాదమ్మ రాజు,సీనియర్ నటి సన (Sana),’జబర్దస్త్’ కమెడియన్ కిరాక్ ఆర్పీ,యాంకర్ శివ.. వంటి వారి పేర్లు ఉన్నాయి.
అందరూ ఎలా ఉన్నా హీరో రాజ్ తరుణ్ పేరు ఉండటం.. అందరినీ ఆలోచనలో పడేసింది. అతను వరుసగా సినిమాల్లో నటిస్తున్నాడు కదా..! ‘సంపాదనకి లోటేంటి’ అన్నట్టు కామెంట్లు చేశారు. బహుశా లావణ్య ఇష్యు వల్ల ఏర్పడిన నెగిటివిటీ తగ్గించుకోవడానికి ‘బిగ్ బాస్’ హౌస్ కి వెళ్లాలనుకుంటున్నాడేమో అని అంతా భావించారు. మొత్తానికి ఈ ఊహాగానాలకు రాజ్ తరుణ్ చెక్ పెట్టేశాడు.
ఈరోజు జరిగిన ‘భలే ఉన్నాడే’ ప్రెస్ మీట్లో పాల్గొన్న రాజ్ తరుణ్ (Raj Tarun) కి.. ‘బిగ్ బాస్’ గురించి ప్రశ్న ఎదురైంది. దీనిపై రాజ్ తరుణ్ స్పందించి క్లారిటీ ఇచ్చాడు. ‘అసలు ఆ వార్తలు ఎందుకు వచ్చాయో నాకే తెలీదు. గట్టిగా ఒక రూమ్లో ఎక్కువ సేపు కూర్చోలేను నేను. అలాంటిది.. బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి అన్నేసి రోజులు.. వాళ్ళు చెప్పింది చేయాలంటే నా వల్ల కాదు’ అంటూ క్లారిటీ ఇచ్చాడు రాజ్ తరుణ్.