కోలీవుడ్ తో పాటు టాలీవుడ్లో కూడా పేరున్న నటుడు సిద్ధార్థ్. తాజాగా ఇతను బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. వివరాల్లోకి వెళితే.. మొన్నటికి మొన్న బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి…. ‘సిద్దార్థ్ సినిమాలకి దావూద్ ఇబ్రహీం(మాఫియా డాన్) పెట్టుబడి పెడుతుంటాడు. ఇప్పుడు సమాధానం చెప్పు’ అంటూ సిద్దార్థ్ ను ఉద్దేశించి తన ట్విట్టర్లో పేర్కొన్నాడు. ఇక సిద్దార్థ్ కూడా గతంలో బి.జె.పి నాయకుల పై తనదైన శైలిలో కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.
అంతేకాకుండా కరోనా టైములో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కూడా విమర్శలు చేశాడు.అందుకే విష్ణువర్ధన్ రెడ్డి సిద్దార్థ్ పై సెటైర్లు వేసినట్టు స్పష్టమవుతుంది. ఇక విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యలకు సిద్దార్థ్ తన ట్విట్టర్ ద్వారా బదులిస్తూ.. “దావూద్ ఇబ్రహీం.. ఏమీ నా టిడిఎస్ చెల్లించడు రా. నేను పర్ఫెక్ట్ సిటిజెన్ ని.. క్రమం తప్పకుండా టాక్స్ చెల్లిస్తున్నాను కదరా విష్ణు. నాకు ఏ మాఫియా డాన్ తో సంబంధం లేదు. వాళ్ళు నా టాక్స్ కట్టరు. వెళ్ళి పడుకో..!
బీజేపీ స్టేట్ సెక్రెటరీ అంట… సిగ్గుండాలి’ ” అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఇక తనని, తన కుటుంబ సభ్యులను బీజేపీ నేతలు బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నారని కూడా సిద్దార్థ్ ఆరోపించిన సంగతి తెలిసిందే.’విష్ణు కామెంట్స్ బట్టి అవి నిజమే అనిపిస్తుంది’ అంటూ సిద్దార్థ్ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. మరి వీళ్ళ ట్విట్టర్ వార్ ఎంత వరకూ వెళ్తుందో చూడాలి.
Most Recommended Video
థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!