తెలుగు హీరోలు రిస్కీ ఫైట్లు చేస్తారు.. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాల్లో నటిస్తారు.. ఈ క్రమంలో గాయాల పాలవుతారు. కొంతమంది హీరోలు అయితే చొక్కా కూడా నలగకుండా డూప్‌ని పెట్టి ఇలాంటివి చేయిస్తున్నారు అనుకోండి. ఆ విషయం పక్కన పెడితే పైన చెప్పిన పనులు చేసి కొంతమంది హీరోలు గాయపడుతున్నారు. దీంతో సినిమా షూటింగ్ షెడ్యూల్స్ డిస్ట్రబ్ అయ్యి మొత్తం ఇబ్బంది వస్తోంది. తాజా వరుణ్ తేజ్ గాయపడటంతో శస్త్రచికిత్స చేయించుకున్నాడు.
కొత్త సినిమా ‘బరి’ కోసం వాలీబాల్ ఆడుతూ ప్రమాదవశాత్తు కాలు విరిగిందని నిహారిక నిర్మాణ సంస్థ తెలిపింది. వరుణ్‌కు (Varun Tej) శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తయింది. వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు. మరింత శక్తిమంతంగా తిరిగి వస్తారు. ఇలాంటి సమయంలో మీ అభిమానం, ప్రేమ, ఆప్యాయత ఎప్పుడూ వరుణ్‌పై ఉంటాయని ఆశిస్తున్నాం అని నిహారిక టీమ్ పోస్ట్‌లో రాసుకొచ్చింది. వరుణ్ మాత్రమే కాదు రీసెంట్‌గా మరికొందరు హీరోలు ఇలా గాయపడ్డారు.
మార్చి చివరి వారంలో ‘పెద్ది’ సినిమా షూటింగ్‌లో రామ్‌చరణ్ (Ram Charan) ఎడమ కంటి దగ్గర్లో గాయమైంది. యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నప్పుడు నుదుటిపై చిన్నపాటి గాయాలయ్యాయి. దీనికి చిన్న శస్త్రచికిత్స అవసరమైంది. అయితే ఆయన త్వరగానే కోలుకుని మళ్లీ షూటింగ్‌లో పాల్గొన్నారు. ఇక ఫిబ్రవరిలో ‘ఫౌజీ’ సినిమా షూటింగ్ సమయంలో గుర్రపు స్వారీ చేస్తుండగా ప్రభాస్‌కు (Prabhas) స్వల్ప గాయమైంది. గతేడాది నవంబరులో ‘బైకర్’ సినిమా చిత్రీకరణలో రాజశేఖర్ చీలమండ ఫ్రాక్చర్ అయింది. దీని కోసం ఆయనకు మేజర్ సర్జరీ జరిగింది.
ఇదంతా చూస్తుంటే టాలీవుడ్ కాస్తా టాలీవూండ్‌గా మారింది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇవి బయటకు వచ్చిన గాయాలు మాత్రమే. కొంతమంది హీరోలు, హీరోయిన్ల గాయాలు కొన్నిసార్లు నెలలు, ఇంకొన్నిసార్లు ఏళ్ల తర్వాత బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సినీ తారలు గాయాల విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం అనే వాదనలు వినిపిస్తున్నాయి.
https://www.youtube.com/watch?v=88_4AfxqdYE